రిలీజ్ తేదీ | : | 18/11/2022 |
దర్శకుడు | : | సాయి కిరణ్ (Sai Kiran) |
సంగీతం | : | ప్రశాంత్ ఆర్ విహారి |
నటీనటులు | : | సంగీత,తిరు వీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు.. .. |
సినిమా శైలి | : | హార్రర్ (Horror) |
రివ్యూ : మసూద (Masooda)
నటీనటులు : సంగీత,తిరు వీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు..
ఎడిటర్: జస్విన్ ప్రభు
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క
దర్శకత్వం: సాయి కిరణ్
విడుదల తేది : 18/11/2022
తెలుగులో సహా ఇతర భాషల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలంటే యాక్షన్, కామెడీ, హార్రర్. తాజాగా ఈ రోజు విడుదలైన మసూద హార్రర్ నేపథ్యంలో తెరకెక్కింది. సీనియర్ కథానాయిక సంగీత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తిరు వీర్, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయమయ్యాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
మసూద కథ విషయానికొస్తే.. సంగీత (నీలం) ఓ సైన్స్ టీచర్. తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్)కు విడాకులు ఇచ్చి విడిగా తన కూతురు నాజియా ( బాంధవి శ్రీధర్)తో ఓ అపార్ట్మెంట్లో కిరయికి ఉంటుంది. నీలం పక్కింట్లో ఉండే గోపీ (తిరు వీర్) వీళ్లకు చేదోడు వాదోడు ఉంటాడు. ఇతనో భయస్థుడు. అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ తన సహోద్యోగి (మిని) ప్రేమిస్తూ ఉంటాడు. అదే సమయంలో గోపీ పక్కింట్లో ఉండే నీలం కూతురు నాదియా దెయ్యం పట్టినట్టు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటోంది. ఆమె అసలు ఎందుకిలా ప్రవర్తిస్తూ ఉంటోంది. అసలు నాదియా నిజంగా దెయ్యం పట్టిందేమో అని ఓ పీర్ బాబా (శుభలేఖ సుధాకర్) దగ్గరకు ఈ నేపథ్యంలో గోపీకి ఎదురైన సంఘటనలు ఏమిటి ? ఇంతకీ మసూద ఎవరు ? చివరకు నాదియా ఎలా మాములు మనిషైందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
యాక్షన్, కామెడీ సినిమాలను ఎలాగో అలా తీసి ప్రేక్షకులకు మెప్పించవచ్చు. కానీ హార్రర్ సబ్జెక్ట్‌ను డీల్ చేయడం అంత తేలికకాదు. ఇలాంటి హార్రర్ సినిమాలను ప్రారంభం నుంచి ఎండ్ కార్డ్ వరకు అదే టెంపోను మెయింటెన్ చేయగలగాలి. మసూద విషయంలో దర్శకుడు తను అనుకున్న కథను చివరకు సస్పెన్స్ చేయడంలో సక్సెస్ సాధించాడు. మధ్యలో హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కాస్తంత చికాకు కలిగించినా.. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ కార్డ్ వరకు ప్రేక్షకులను కథలో కనెక్ట్ చేయడంతో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా దర్శకుడు 80, 90లలో చూపించి ప్రస్తుత కాలంలో తీసుకొస్తాడు. కొత్త దర్శకుడు అయిన తను అనుకున్న కథను తెరపై ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించాడు సాయి కిరణ్. ప్రీ క్లైమాక్స్ ముందు మసూద ఎవరనే విషయాన్ని రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంది. క్లైమాక్స్ కాస్త సాగతీత లేకుండా ఇంకాస్త ట్రిమ్‌తో తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన నగేష్ బానెల్ ప్రతి దృష్యాన్ని అందంగా తెరపై చూపించాడు. నైట్ విజువల్స్, హ్రార్రర్ సన్నివేశాలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాకు ఎస్సెట్ అని చెప్పాలి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
సంగీత.. ఒక సగటు తల్లి పాత్రకు పాత్రకు న్యాయం చేసింది. ఇక సంగీత కూతురు పాత్రలో నటించిన బాంధవి శ్రీధర్ తన నటనతో భయపెట్టింది. అంతేకాదు తెరపై హీరోయిన్ కంటే ఈమె అందంగా కనపడిందనే చెప్పాలి. ఇక హీరోగా నటించిన తిరు వీర్ నటన బాగుంది. హీరోయిన్ నటించిన కావ్య కళ్యాణ్ రామ్‌కు పెద్దగా నటించే స్కోప్ లేకుండా పోయింది. శుభలేక సుధాకర్ పీర్ బాబా పాత్రలో ఆకట్టుకున్నాడు. అల్లావుద్దీన్ గా సత్యం రాజేష్, అబ్డుల్గా సత్య ప్రకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్..
కథ, స్క్రీన్ ప్లే
టేకింగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
క్లైమాక్స్ సాగతీత
హీరో, హీరోయిన్స్ లవ్ ట్రాక్
చివరి మాట : మసూద.. హార్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు కనెక్ట్ అవుతోంది.
రేటింగ్ : 3/5
కథ | : | 3/5 |
స్క్రీన్ ప్లే | : | 3/5 |
దర్శకత్వం | : | 3/5 |
సంగీతం | : | 3/5 |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.