హోమ్ /వార్తలు /సినిమా /

Masooda: హరర్ డ్రామాగా మసూద.. ఆగస్ట్ 2న టీజర్ రిలీజ్..!

Masooda: హరర్ డ్రామాగా మసూద.. ఆగస్ట్ 2న టీజర్ రిలీజ్..!

మసూద టీజర్ రిలీజ్

మసూద టీజర్ రిలీజ్

‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

    ‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో రాబోతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’. కంటెంట్ రిచ్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆగస్ట్ 2న ఈ చిత్ర టీజర్‌ విడుదల కాబోతోంది. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్ కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో ప్రామిసింగ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

    హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  ఇక ఈ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్నారు. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. రచన దర్శకత్వం సాయి కిరణ్ అందిస్తున్నారు.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Tollywood

    ఉత్తమ కథలు