• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MASHESH BABU SPECIAL WISHES TO ALL WOMENS FOR WOMENS DAY AND HE SHARES SPECIAL PIC TA

Mahesh Babu - Womens Day: ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తల్లి, భార్య, కూతురు ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు..

Mahesh Babu - Womens Day: ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తల్లి, భార్య, కూతురు ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు..

ఉమెన్స్ డే సందర్భంగా మహేష్ బాబు స్పెషల్ విషెస్ (Instagram/Photo)

Mahesh Babu - Womens Day: మహేష్ బాబు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తల్లి, భార్య, కూతురు ఫోటోను షేర్ చేస్తూ ప్రపంచంలోని మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసారు. 

  • Share this:
    Mahesh Babu - Womens Day: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సహా  ప్రతి ఒక్కరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. తాజాగా మహేష్ బాబు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తల్లి, భార్య, కూతురు ఫోటోను షేర్ చేస్తూ ప్రపంచంలోని మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసారు. ఎవరి జీవితమైన తల్లితోనే మొదలైవుతుంది. పెళ్లి తర్వాత ప్రతి మగాడి జీవితంలో భార్యకు స్థానం ఉంటుంది. ఆపై కూతురు ప్రాముఖ్యతను ఎంత చెప్పుకున్న తక్కువ. ఒక్క మహేష్ బాబు జీవితంలోనే ప్రతి మగాడి జీవితంలో తల్లి, భార్య, కూతురు పాత్రను ఎవరు కాదనలేరు.



    మహేష్ బాబు విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దుబాయ్ షెడ్యూల్ కంప్లీటైంది. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికొస్తే..  ఈ మూవీని పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.

    mahesh babu twitter,mahesh babu new look,mahesh babu new hairstyle,mahesh babu sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata mass song,sarkaru vaari paata mahesh babu look,mahesh babu new look for sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata new look,mahesh babu family,mahesh new look,మహేష్ బాబు న్యూ లుక్,మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు,సర్కారు వారి పాట మాస్ సాంగ్ మహేష్ బాబు
    సర్కారు వారి పాట (Sarkaru Vaari paata)


    మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటించడం దాదాపు ఖాయం అయింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు