Nani : మరో క్రేజీ కథతో వస్తోన్న నాని మారుతి కాంబినేషన్..

నాని, మారుతి Photo : facebook

Nani : నాని, మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు.

  • Share this:
    నాని, మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా నాని కెరీల్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మారుతి కూడా తన సినిమాల తీరును మార్చుకున్నాడు. క్లీన్ ఎంటర్ టైనర‌్స్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఆ సూపర్ హిట్ తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావించారు. అందుకు తగ్గట్లుగానే మారుతి, నానిలు కూడా మరోసారి కలిసి వర్క్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ టైమ్ ఇప్పుడోచ్చింది. వీరి కాంబినేషన్ మళ్లీ ఓ పట్టాలెక్కనుంది. అందులో భాగంగా మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం. ఈ లాక్ డౌన్ సమయంలో మారుతి నానికి కథ చెప్పాడట.. మారుతి చెప్పిన కథ నానికి నచ్చడంతో.. నాని కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

    నాని, మారుతి Photo : facebook


    ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘వి’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నాని.. శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలాతో సూపర్ హిట్ అందుకున్న రాహుల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: