Home /News /movies /

Maruthi Manchi Rojulu Vachayi: 30 రోజుల్లో సినిమా తీయడం ఎలా.. మారుతి ‘మంచి రోజులు వచ్చాయి..’

Maruthi Manchi Rojulu Vachayi: 30 రోజుల్లో సినిమా తీయడం ఎలా.. మారుతి ‘మంచి రోజులు వచ్చాయి..’

మారుతి మంచి రోజులు వచ్చాయి (maruthi manchi rojulu vachayi)

మారుతి మంచి రోజులు వచ్చాయి (maruthi manchi rojulu vachayi)

Maruthi Manchi Rojulu Vachayi: ఒకప్పుడు సినిమాను 30 రోజుల్లో తీసేవారంట అని ఇప్పటి తరం చదువుకోవాల్సిందే కానీ అది నిజం అయ్యే సూచనలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు ఒక్క షెడ్యూల్ కూడా 30 రోజుల్లో పూర్తి కావడం లేదు. కానీ దీన్ని మారుతి(Maruthi Manchi Rojulu Vachayi) చేసి చూపించాడు.

ఇంకా చదవండి ...
ఒకప్పుడు సినిమాను 30 రోజుల్లో తీసేవారంట అని ఇప్పటి తరం చదువుకోవాల్సిందే కానీ అది నిజం అయ్యే సూచనలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు ఒక్క షెడ్యూల్ కూడా 30 రోజుల్లో పూర్తి కావడం లేదు. చిన్న సినిమాలు కూడా ఆర్నెళ్లు తీస్తున్నారు. అలాంటిది ఇప్పుడున్న రోజుల్లో 30 రోజుల్లో సినిమా చేయడం అంటే మాటలు కాదు. కానీ అనుకుంటే అసాధ్యం ఏదీ లేదు. మాటల్లో కాదు చేతల్లో దీన్ని చేసి చూపించాడు దర్శకుడు మారుతి. కాన్సెప్టు సినిమాలు తీయడంలో ఈయన దిట్ట. అందుకే ఇప్పుడు కూడా ఇదే చేసాడు. కేవలం నెల రోజుల్లోనే ఓ సినిమాను తీసి.. విడుదలకు సిద్ధం చేసాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యేంత వరకు అసలు అలాంటి ఓ సినిమా వస్తుందనే విషయమే ఎవరికీ తెలియదు. అంత సైలెంట్‌గా 30 రోజుల్లో సినిమా తీసాడు మారుతి. దాని పేరు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్యాండమిక్ సిచ్చువేషన్ నేపథ్యంలోనే ఈ చిత్ర కథ రాసుకున్నాడు మారుతి.

‘ఏక్ మినీ కథ’ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా ఈ సినిమా చేసాడు మారుతి. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేసాడు మారుతి. షూటింగ్ కూడా నెల రోజుల్లోనే అయిపోయింది. 40 రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయింది సినిమా. 20 రోజుల్లో కథ రాసిన తాను.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని.. ఇంకో 10 రోజులకు రిలీజ్ చేసేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు అతను చెప్పాడు. అనుకున్నట్లుగానే అన్నీ పూర్తి చేసాడు. లాఫింగ్ థెరపీపై 'మంచి రోజులు వచ్చాయి' సినిమా చేసాడు మారుతి.
maruthi,maruthi twitter,maruthi manchi rojulu vachayi,maruthi manchi rojulu vachayi shooting,maruthi manchi rojulu vachayi shooting in 30 days,మారుతి,మారుతి మంచి రోజులు వచ్చాయి,మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమా షూటింగ్ 30 రోజులు
గోపీచంద్ పక్కా కమర్షియల్ (Gopichand)

ఇప్పుడున్న బాధల సమయంలో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని ముందు నుంచీ అనుకున్నానని.. ఇప్పుడు అదే చేసానంటున్నాడు మారుతి. ఈ చిత్రంలో చాలా చిత్రమైన పాత్రలు ఉంటాయని.. అవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని మారుతి ధీమాగా చెప్తున్నాడు. యువి కాన్సెప్ట్స్‌తో కలిసి మాస్ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్‌తో చేస్తున్న 'పక్కా కమర్షియల్' నుంచి కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమాను మారుతి రూపొందించాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Maruthi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు