• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MARAKKAR TELUGU TRAILER RELEASED BY CHIRANJEEVI AND RAM CHARAN TRENDS IN TOP SR

Marakkar Trailer : కుంజలి మరక్కార్‌గా మోహన్ లాల్.. అదిరిన ట్రైలర్..

Marakkar Trailer : కుంజలి మరక్కార్‌గా మోహన్ లాల్.. అదిరిన ట్రైలర్..

మరక్కార్ పోస్టర్ Photo : Twitter

Marakkar Trailer : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం 'మరక్కార్'.

  • Share this:
    Marakkar Trailer : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం 'మరక్కార్'. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి "నా ప్రియ మిత్రుడు మోహన్ లాల్, ప్రియదర్శన్‌ల డ్రీమ్ ప్రాజెక్టు 'మరక్కార్... అరేబియా సముద్ర సింహం' ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ తిరు తన కెమెరా వర్క్‌తో వెండితెరపై మరోసారి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నా. చిత్రం విజయం సాధించాలనీ కోరుకుంటున్నా.. అని పేర్కొన్నారు. కాగా మలయాళ సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్ లో భారీగా తెరకెక్కిన సినిమా 'మరక్కార్' ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుంటే.. ఆయన సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రల్లో అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని వంటీ సీనియర్ నటులు నటిస్తున్నారు. మార్చి 26న విడుదలకానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'మరక్కార్'ను ప్రధానంగా 16వ శతాబ్దంలో కుంజలి మరక్కార్ అనే ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్ నిర్మించాడు. రోనీ రాఫెల్ సంగీతం అందించాడు. 'బాహుబలి'కి పనిచేసిన సాబు సిరిల్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా చేశాడు. సినిమాటోగ్రఫీని తిరు అందించాడు. నిన్న సాయంత్రం విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published: