• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MANMADHUDU ACTRESS ANSHU AMBANI GETTING READY TO ACT AGAIN IN TOLLYWOOD SOURCES SAYS PK

Anshu Ambani: 18 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ‘మన్మథుడు’ హీరోయిన్..?

Anshu Ambani: 18 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ‘మన్మథుడు’ హీరోయిన్..?

అన్షు అంబానీ (Anshu Ambani)

Anshu Ambani: 19 ఏళ్ల కింద నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సినిమాను అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకుడు. అప్పట్లో నాగ్ కెరీర్‌లోనే పెద్ద హిట్ అయింది ఈ సినిమా.

  • Share this:
19 ఏళ్ల కింద నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సినిమాను అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకుడు. అప్పట్లో నాగ్ కెరీర్‌లోనే పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఇప్పుడు చూసినా కూడా మన్మథుడు ఏ మాత్రం బోర్ కొట్టదు. అలాంటి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు అనే మరో భామ కూడా నటించింది. మన్మథుడు సినిమాతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మన్మథుడు విడుదలైన తర్వాత ఈమె గురించి చాలా మంది హీరోలు ఆరా తీసారు కూడా. వెంటనే ప్రభాస్ హీరోగా వచ్చిన రెండో సినిమా రాఘవేంద్రలో కూడా ఈమె నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసింది అన్షు. ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ ఉన్నట్లుండి తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది అన్షు. ఎక్కడుందో.. ఏం చేస్తుందో అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అంత సీక్రేసీ మెయింటేన్ చేసింది అన్షు. కొన్ని కన్నడ సినిమాలు చేసిన తర్వాత లండన్ వెళ్లిపోయింది ఈమె. అక్కడే పుట్టి పెరగడంతో అతిథిలా ఇండస్ట్రీకి వచ్చిందంతే. వెంటనే రెండు మూడు సినిమాలు చేసి చదువుకోడానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉండి చదువు పూర్తి చేసి తాను పుట్టి పెరిగిన లండన్‌లోనే సెటిల్ అయిపోయింది అన్షు. అక్కడే ఉన్న బిజినెస్‌మేన్ సచిన్ సగ్గార్‌ను పెళ్లి చేసుకుంది.

మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ (anshu ambani/Instagram)
మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ (anshu ambani/Instagram)


వీళ్లకు ఓ పాప కూడా ఉంది. అంతేకాదు.. తన తెలివి తేటలతో ఫ్యాషన్ డిజైనర్‌గా అక్కడ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది అన్షు. లండన్‌లో ఈమెకు ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ కూడా ఉంది. బాలీవుడ్ హీరోయిన్లతో పాటు మన హీరోయిన్లు కూడా వేసుకునే దుస్తులకు అక్కడ డూప్లీకేట్ చేసి అమ్మకాలు చేస్తారని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయింది అన్షు. చేసింది రెండు మూడు సినిమాలే అయినా కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. స్టార్ అవుతుందేమో అనుకుంటే ఉన్నఫలంగా ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోయింది మన్మథుడు సుందరి.

anshu ambani,anshu ambani twitter,anshu ambani instagram,anshu ambani in trivikram NTR movie,anshu ambani hot,manmadhudu comedy scenes,manmadhudu movie,manmadhudu video songs,manmadhudu love scenes,anshu ambani,manmadhudu romantic scenes,manmadhudu heroine anshu,manmadhudu hd video songs,manmadhudu movie fame anshu,manmadhudu movie fame actress anshu latest photos,anshu,actress anshu,manmadhudu movie comedy scenes,anshu ambani manmadhudu,anshu ambani husband,anshu ambani nagarjuna,అన్షు అంబానీ,అన్షు మన్మథుడు,త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో అన్షు అంబానీ
అన్షు అంబానీ (Anshu Ambani)


ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు అన్షు మళ్లీ తెలుగు సినిమాల్లోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమాలో ఈమె హీరో అక్క పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నదియా, ఖుష్బూ, టబు లాంటి సీనియర్ హీరోయిన్‌లను తన సినిమాల్లో చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అన్షును కూడా ఇదే దారిలో తీసుకొస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏదేమైనా కూడా అన్షు కానీ మళ్లీ నటించిందంటే మాత్రం కచ్చితంగా బిజీ అయిపోవడం ఖాయం.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు