Manchu Manoj : హీరో మంచు మనోజ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు.. వివరాల్లోకి వెళితే.. మన దేశంలో రూల్స్ అనేవి సామాన్యులకే.. అదే పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తప్పులు చేస్తే చూస్తూ పోలీసులు కానీ మరే వ్యవస్థ వారి జోలికి పోదనే వాదన కూడా ఉంది. ఇక కొంత మంది అధికారులు పెద్దల మెప్పు కోసం చేసే తప్పులు మొత్తం వ్యవస్థనే తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తప్పు చేస్తే చూస్తూ పోయే అధికారులతో పాటు.. చట్టాన్ని నిక్కచ్చిగా పాటించే అధికారులు కూడా మన దగ్గర ఉన్నారు. ఇక మన దగ్గర హీరోలు కొంత మంది తాము చట్టానికీ అతీతలమనే భావన ఉంటోంది. ఏదో పై నుంచి ఊడి పడినట్టు బిల్డప్ ఇస్తుంటారు. తాజాగా చట్ట విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అమర్చిన నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు హైదరాబాద్ పోలీసులు బిగ్‌షాక్ ఇచ్చారు.
హైదరాబాద్ టోలీచౌకీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మనోజ్ కారుకు నిబంధనలకు విరుద్ధుంగా బ్లాక్ ఫిల్మ్ అద్దాలు అమర్చి ఉండటంతో పోలీసులు బ్లాక్ ఫిల్మ్‌ను తొలిగించారు. అంతేకాదు ఈయన నడిపిస్తోన్న కారు నంబర్ AP 39HY 0319కు చలాన్ విధించారు. దీంతో పాటు ఆ దారిలో నిబంధనలకు విరుద్దంగా వెళుతున్న మరికొంత మందిపై పోలీసులు జరిమానాలు విధించారు.
రీసెంట్‌గా అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు కూడా కారుకు నల్ల అద్దాలు తొలిగించడంలో పాటు చెరో రూ. 700 జరిమాన విధించిన సంగతి తెలిసిందే కదా. మంచు మనోజ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన ప్రస్తుతం అహం బ్రహ్మాస్మీ’ సినిమాను పూర్తి చేసారు. ఈ సినిమాపై మంచు మనోజ్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాకు మంచు నిర్మాత అవతారం ఎత్తారు.
RRR : ఆర్ఆర్ఆర్ చిత్రంలో చిన్నారి మల్లి పాత్ర చేసిన ఈ అమ్మాయి గురించి తెలుసా..
అటు మంచు మనోజ్.. తెలంగాణ రాష్ట్ర మంత్రులతో మంచు మనోజ్ తెలంగాణలోని టూరిజం పై చర్చించారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన టూరిజం ప్రాజెక్ట్స్‌తో పలు అంశాలు చర్చించారు. అనంతగిరిలో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 150 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వచ్చారన్నారు. ఇందులో సినిమావాళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. అందులో మంచు మనోజ్ కూడా తన వంతుగా పెట్టుబడులు పెడుతున్నారు. మంచు మనోజ్ రెండో పెళ్లిపై పలు వార్తలు వచ్చాయి. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు దేశమంతా స్నేహితులతో కలిసి చుట్టేసాడు మనోజ్. ఆ తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే.. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమేమి లేదని చెప్పడం కొసమెరపు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.