Home /News /movies /

MANISHARMA GIVES MUSIC TO BALAMEVVADAM MOVIE SONG MOUNAMA ODIPO RELEASED NR

Balamevvadu: మణిశర్మ సంగీతం అందించిన 'బ‌ల‌మెవ్వ‌డు' నుంచి 'మౌన‌మా ఓడిపో..' పాట విడుద‌ల‌..

balamevvadam

balamevvadam

Balamevvadu: చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాడు సంగీత దర్శకుడు మణిశర్మ. ఈయన సంగీత సారథ్యంలో తాజాగా బలమెవ్వడు అనే సినిమా వస్తోంది. ఇందులో నుంచి ఒక పాట విడుదలైంది.

    Balamevvadu: చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాడు సంగీత దర్శకుడు మణిశర్మ. ఈయన సంగీత సారథ్యంలో తాజాగా బలమెవ్వడు అనే సినిమా వస్తోంది. ఇందులో నుంచి ఒక పాట విడుదలైంది. 'మౌన‌మా ఓడిపో.. ఓన‌మాలాట‌లో దూర‌మా చేరిపో..  చేతుల గీత‌లో'' అని ప్రేయ‌సి ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ గురించి త‌పిస్తుంటే.. బ‌త‌కు బ‌డి ప్రేమ‌గా బ‌డి ప‌లుకు రాసుకో నిచ్చెలి ముచ్చ‌టె దాచుకోగా.. ' అంటూ ప్రేమికుడు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు. అస‌లు ప్రేమికుడు, ప్రేయ‌సి ఎవ‌రు? వారి మ‌ధ్య ప్రేమ ఎందుకు.. ఎలా పుట్టింది? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం `బ‌ల‌మెవ్వ‌డు` సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

    balamevvadam
    balamevvadam


    ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు "బలమెవ్వడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను లిరిక‌ల్ వీడియో పాట‌గా చిత్ర యూనిట్ గురువారం విడుద‌ల చేశారు. క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి రాసిన ఈ పాట‌ను, అనురాగ్ కుల‌క‌ర్ణి, సాహితి చాగంటి పాడారు.



    మెలోడీ సాంగ్స్‌కు ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసి మెలోడి బ్ర‌హ్మ అనే పేరుని త‌న పేరు ముందు చేర్చుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీత సార‌థ్యాన్ని వహిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన కాన్సెప్ట్ టీజ‌ర్‌కు, మ‌ర‌క‌త మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి పాడిన టైటిల్ సాంగ్‌.. `బ‌ల‌మెవ్వ‌డు`కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే రిలీజ్‌డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత ఆర్‌.బి.మార్కండేయులు తెలిపారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Balamevvadam, Balamevvadam movie, Manisharma, Mounama odipo, Music director manisharma, Tollywood

    తదుపరి వార్తలు