MANIRATHNAM CREATIONS NAVARASA TRAILER RELEASED AND TRENDING IN YOUTUBE NR
Navarasa - Mani Ratnam: మణిరత్నం 'నవరస' ట్రైలర్ రిలీజ్.. తొమ్మిది మంది స్టార్లు.. ఎలా ఉందంటే?
Navarasa
Navarasa - Mani Ratnam: ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లకు అలవాటు పడుతున్నారు స్టార్ నటులు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరో హీరోయిన్స్ వరుస వెబ్ సిరీస్ లలో నటించి మంచి సక్సెస్ లు అందుకుంటున్నారు.
Navarasa - Mani Ratnam: ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లకు అలవాటు పడుతున్నారు స్టార్ నటులు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరో హీరోయిన్స్ వరుస వెబ్ సిరీస్ లలో నటించి మంచి సక్సెస్ లు అందుకుంటున్నారు. పైగా సినిమాకి ఉన్నంత రేంజ్ వెబ్ సిరీస్ లకు రావడంతో ప్రతి ఒక్కరు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ లపై దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సిరీస్ నవరస ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో విడుదలకానున్న 'నవరస' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. నిజానికి మణిరత్నం సినిమాల కోసం ఎంతోమంది ప్రేక్షకులు అభిమానులుగా మారగా.. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో రానున్న ఈ సిరీస్ కోసం కూడా బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మణిరత్నం సినిమాలలో మంచి క్రేజ్ ఉండగా కొన్ని రోజుల కిందట క్రేజ్ మొత్తం తగ్గిపోవడంతో.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
దీంతో తమిళ స్టార్ హీరోలు సూర్య, విజయ్ సేతుపతి వంటి పలువురు నటులతో విడుదల చేయనున్న నవరస సిరీస్ నుండి తాజాగా అఫీషియల్ ట్రైలర్ విడుదలయింది. ప్రస్తుతం ఈ సిరీస్ ట్రైలర్ యూట్యూబ్ లో బాగా హల్ చల్ చేయగా మరింత ఆసక్తిగా మారింది. ఇక ఇందులో రవీంద్రన్ ఆర్ ప్రసాద్, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ, అర్జున్ కే. ఎం. ప్రియదర్శన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజు, వసంత్ లు ఇలా తొమ్మిది మంది డైరెక్టర్ లతో తొమ్మిది భాగాలతో సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సిరీస్ ఆగస్టు 6న ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. నవరస అంటే 9 రసలైన హాస్యం, శృంగారం, రౌద్రం, శాంతం, భయానకం, అద్భుతం, కరుణ, వీరం, బీభత్సం వంటి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుండి ఫస్ట్ లుక్, పాటలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.