బయోపిక్ కోసం క్రిష్‌కు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట..

గత కొంత కాలంగా దర్శకుడు క్రిష్, ‘మణికర్ణిక’ హీరోయిన్ కంగనా మధ్య దర్శకత్వం క్రెడిట్ విషయంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. మొత్తం షూటింగ్ తాను పూర్తి చేస్తే డైరెక్టర్‌గా కంగనా పేరు వేసుకున్నారని క్రిష్ సంచలన కామెంట్స్ చేసాడు. అంతగా అవమానాలు, విమర్శలు భరించిన క్రిష్..‘మణికర్ణిక’కు సినిమాను డైరెక్ట్ చేసినందకు రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేదట.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 28, 2019, 7:06 AM IST
బయోపిక్ కోసం క్రిష్‌కు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట..
క్రిష్ (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
గత కొంత కాలంగా దర్శకుడు క్రిష్, ‘మణికర్ణిక’ హీరోయిన్ కంగనా మధ్య దర్శకత్వం క్రెడిట్ విషయంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. మొత్తం షూటింగ్ తాను పూర్తి చేస్తే డైరెక్టర్‌గా కంగనా పేరు వేసుకున్నారని క్రిష్ సంచలన కామెంట్స్ చేసాడు. తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే క్రిష్‌కు విమర్శలే  ఎదురయ్యాయి.

అంతగా అవమానాలు, విమర్శలు భరించిన క్రిష్..‘మణికర్ణిక’కు సినిమాను డైరెక్ట్ చేసినందకు రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేదట. ఇవ్వాల్సిన పారితోషకంలో ముప్పై శాతమే క్రిష్‌కి ఇచ్చారట. మిగిలిన డబ్బును క్రిష్ అడిగింది లేదు. వాళ్లు ఇచ్చింది లేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రావాల్సిన రెమ్యునరేషన్‌ను ఎందుకు అడగలేదని క్రిష్‌ని ప్రశ్నిస్తే.. ఆ సినిమా విడుదల సమయానికి చిత్ర నిర్మాతకు ఆరోగ్యం సరిగా లేనందున నేను అడగలేదని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు తనకు రావాల్సిన బకాయిల విషయంలో తాను దర్శకుల సంఘాన్ని ఆశ్రయించి పోరాడవచ్చు. కానీ ఇప్పటికే తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే విమర్శించారని..మళ్లీ రెమ్యూనరేషన్ గురించి అడిగి వార్తల్లో వ్యక్తిగా మారాలనుకోవడం లేదున్నారు. తను డబ్బు కోసం ఆలోచించే రకంగా కాదని ఈ సందర్భంగా గుర్తు చేసారు.

First published: February 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు