హోమ్ /వార్తలు /సినిమా /

Ponniyin Selvan Twitter Review : పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..

Ponniyin Selvan Twitter Review : పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..

Mani Ratnam vikram jayam ravi karthi trisha Ponniyin Selvan twitter review

Mani Ratnam vikram jayam ravi karthi trisha Ponniyin Selvan twitter review

Ponniyin Selvan - 1 | ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan - 1). ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.. సినిమా ఎలా ఉంది.. తెలుగు వారిని ఎంత మాత్రం ఆకట్టుకోనుంది.. నటీ నటుల ఫెర్మామెన్స్ ఎలా వంటి అంశాలను చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Ponniyin Selvan - 1 | ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan - 1). ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) విడుదల చేస్తున్నారు. ఇక ఈ కథ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా తమిళ నేటీవిటిగా చెందిన కథ.. ఆ పేర్లు.. అవి.. అంత తమిళ పేర్లు అవ్వడంతో కనెక్టివిటీ కాస్తా తక్కువుగా ఉంటోంది. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan - 1) నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను (Ponniyin Selvan - 1) తెరకెక్కించడం తన లైఫ్ టైమ్ డ్రీమ్ అంటూ మణిరత్నం ప్రకటించారు. బాహుబలి ఇచ్చిన సక్సెస్‌తో మణి రత్నం ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టాని ఆ మధ్య పేర్కోన్న సంగతి తెలిసిందే..

  లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో, విక్రమ్ (Vikran) .. కార్తి (Karthi) .. జయం రవి (Jayam Ravi) .. శరత్ కుమార్ .. పార్తీబన్ .. ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) .. త్రిష (Trisha).. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మాన్సం (AR Rahman)గీతాన్ని సమకూర్చారు. ఇక ఈ సినిమాను తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో రూ. 295 విక్రయించడం అనేది  ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇది అంత త్వరగా తెలుగువారికి కనెక్ట్ అయ్యే సినిమా కాద.. ఆ కథ, పేర్లు.. అంతా తమిళ నేటీవిటికి చెందినది. ఈ క్రమంలో దాదాపుగా 300 రూపాయలు అంటే కష్టమే అంటున్నారు నెటిజన్స్.. ఇక ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండడంతో.. ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.. సినిమా ఎలా ఉంది.. తెలుగు వారిని ఎంత మాత్రం ఆకట్టుకోనుంది.. నటీ నటుల ఫెర్మామెన్స్ ఎలా వంటి అంశాలను చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం..

  ఈ నెటిజన్స్ రివ్యూలను బట్టి చూస్తుంటే.. సినిమా బాగానే ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎక్కువగా తమిళ వారికి నచ్చే అవకాశం.. తెలుగు వారు ఎవరైతే కల్కి రాసిన ఆ నవల చదువుతారో.. వారికి వెంటనే కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు సినిమాను చూసిన నెటిజన్స్.. చూడాలి మరి లాంగ్ రన్‌లో ఎలా ఉండనుందో..

  ఈ సినిమా (Ponniyin Selvan - 1)ఏదో ఓ అప్ డేట్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తెలుగు వెర్షన్ కి సంబంధించి కథలోకి వెళ్లడానికి ముందు, ఆ తరువాత కొన్ని సన్నివేశాలను కలిపే సందర్భంలోను చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టుగా సమాచారం. రీసెంట్‌గా వచ్చిన ’బ్రహ్మాస్త్ర’ సహా పలు చిత్రాలకు చిరు తన గొంతు వినిపించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాను తెలుగులో మంచి బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలంగాణ (నైజాం)లో రూ. 3.5 కోట్ల బిజినెస్ చేసింది. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4.5 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. హిట్ అనిపించుకోవాలంటే ఈ సినిమా రూ. 10.50 కోట్ల షేర్ రాబడితే.. హిట్ అనిపించుకుంటుంది.

  ఇక ఈ సినిమా(Ponniyin Selvan - 1)కు తమిళంలో కమల్ తోను .. కన్నడలో ఉపేంద్రతోను .. మలయాళంలో మమ్ముట్టితోను .. హిందీలో అజయ్ దేవగణ్ తోను వాయిస్ ఓవర్ చెప్పించారట. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా, రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం కూడా మొదటి భాగం నుండి రెండవ భాగం వరకు లీడ్ మరియు సస్పెన్స్ కొనసాగుతుంది అని తెలుస్తోంది. క్లైమాక్స్‌కి సంబంధించిన సన్నివేశాలు కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Ponniyin Selvan-1, Tollywood news

  ఉత్తమ కథలు