news18-telugu
Updated: March 31, 2020, 6:16 PM IST
సుమలత (Twitter/Photo)
సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. కరోరా వైరస్ నేపథ్యంలో మన ప్రధాన మంత్రి 21 రోజులు లాక్డౌన్ ప్రకటించారు. ఈ సందర్భంగా రోజు కూలీ నాలీ చేసుకునే వాళ్లతో పాటు రెక్కాడితే కానీ డొక్కాడని చాలా మందికి పని లేకుండా పోయింది. వీరందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడానికి కార్యచరణ ప్రకటించాయి. ఇక సినిమా నటీనటులతో పాటు మిగతా సెలబ్రిటీలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సాయం ప్రకటించాయి. తాజాగా ఒకప్పటి హీరోయిన్ మాండ్యా ఎంపీ సుమలత పీఎం రిలీఫ్ ఫండ్‌కు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ. 1 కోటిని విరాళంగా ప్రకటించింది. మరోవైపు సుమలత లాక్డౌన్ కారణంగా పనిలేకుండా పోయినవారికి తన వంతు సాయం అందిస్తోంది. సుమలత విషయానికొస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా తన సమీప జేడీఎస్ అభ్యర్ధి నిఖిల్ గౌడపై భారీ మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. అంతేకాదు కర్ణాటక చరిత్రలో 52 ఏళ్ల తర్వాత మాండ్య నుంచి లోక్‌సభకు వెళుతున్న తొలి స్వతంత్య్ర మహిళ అభ్యర్ధిగా సుమలత రికార్డు క్రియేట్ చేసారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
March 31, 2020, 6:10 PM IST