news18-telugu
Updated: June 17, 2019, 1:11 PM IST
మంచు విష్ణు ఓటర్ మూవీ
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. దేశ ప్రజలు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇదంతా పక్కన పెడితే.. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మంచు విష్ణు ఓటు వేసే ఓటర్ పవర్ పై ‘ఓటర్’ సినిమా చేసాడు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎపుడో రెండో క్రితం విడుదల కావాల్సింది. కానీ హీరోకు, దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. సురభి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నాజర్, సంపత్, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రజా స్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ..ఓటర్లను చైతన్యవంతులను చేసే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. నేటి సమాజంలో చాలా మంది రాజకీయ నాయకులు.. ఎన్నికల వరకే ఓటర్లకు దండాలు పెట్టడం.. ఎన్నికలు ముగిసిన తర్వాత అదే ఓటర్లకు ఎగనామం పెట్టడం కామన్ అయిపోయింది.
అలాంటి రాజకీయ నాయకులకు ఒక ఓటర్‌గా మంచు విష్ణు ఎలా బుద్ది చెప్పాడన్నదే ఈ సినమా స్టోరీ. ఇప్పటికే ఈ చిత్ర సెన్సార్ పూర్తైపోయింది. సినిమా చూసాక సెన్సార్ సభ్యులు కూడా బాగుందని మెచ్చుకోవడంతో సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నాడు విష్ణు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది. ఈ సినిమాను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో హీరోగా మంచు విష్ణు హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
June 17, 2019, 1:11 PM IST