Home /News /movies /

MANCHU VISHNU WIFE VIRANICA MANCHU STRONG WARNING TO KAJAL AGARWAL AND HER TWEET GOES VIRAL PK

కాజల్ అగర్వాల్‌ను కాలితో తంతానంటున్న మంచు విష్ణు భార్య..

కాజల్ అగర్వాల్ మంచు విష్ణు దంపతులు (Source: Twitter)

కాజల్ అగర్వాల్ మంచు విష్ణు దంపతులు (Source: Twitter)

అవును.. ఇదేదో జోక్ కాదు. నిజంగానే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌ను తంతానని చెప్పింది విష్ణు భార్య విరోనికా. అంతపెద్ద మాట అనడానికి కారణం కూడా లేకపోలేదు. కాజల్ చేసిన ఓ పనికి మంచు విష్ణు భార్య చాలా కోప్పడింది.

అవును.. ఇదేదో జోక్ కాదు. నిజంగానే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌ను తంతానని చెప్పింది విష్ణు భార్య విరోనికా. అంతపెద్ద మాట అనడానికి కారణం కూడా లేకపోలేదు. కాజల్ చేసిన ఓ పనికి మంచు విష్ణు భార్య చాలా కోప్పడింది. ఆమెతో పాటు సపోర్ట్ చేసినందుకు విష్ణును కూడా తంతానని చెప్పింది విరోనికా. ఇంతకీ విషయం ఏంటంటే.. మంచు విష్ణు తన ట్విట్టర్ పేజీలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం గర్భంతో ఉన్న విరోనికా డెలవరీని ఇన్‌స్టా పేజీలో లైవ్ పెట్టేస్తానని పోస్ట్ చేసాడు.

చాలా డిస్కషన్స్ తర్వాత.. డిబేట్స్ తర్వాత తన భార్య డెలవరీని లైవ్‌లో ఇద్దామనుకుంటున్నానంటూ పోస్ట్ చేసాడు విష్ణు. ఈ ఐడియా ఇచ్చినందుకు కాజల్ థ్యాంక్యూ అంటూ ఆమెను కూడా ఇరికించేసాడు విష్ణు. ఇక ఈ పోస్ట్ పెట్టిన కాసేపటి తర్వాత విరోనికా కూడా లైన్‌లోకి వచ్చింది. తంతాను.. ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చినందుకు కాజల్ నిన్ను.. అందులో ఆలోచించడానికి కూడా ఏం లేదు అంటూ పోస్ట్ చేసింది.

దాంతో విష్ణు కూడా మనసు మార్చుకున్నాడు. కొన్ని కారణాల వల్ల తన నిర్ణయం మార్చుకుంటున్నట్లు చెప్పాడు. ముఖ్యంగా ఆమెకు మోహన్ బాబు సపోర్ట్ కూడా ఉండటంతో తన డిసిషన్ మార్చుకోక తప్పడం లేదని చెప్పాడు మంచు వారబ్బాయి. మొత్తానికి ఈ ఆలుమగల మధ్య వచ్చి కాజల్ అడ్డంగా ఇరుక్కుపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kajal Aggarwal, Manchu Vishnu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు