మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యాడు. మంచు విష్ణు భార్య విరానికా ఓ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. గతంలో వారికి ఓ ట్విన్స్ ఆడపిల్లలు, ఓ బాబు ఉన్నారు. మూడోసారి ముచ్చటగా మహాలక్ష్మికి జన్మనిచ్చింది మంచు విరానికా. శ్రావణ శుక్రవారం రోజు పండంటి ఆడపిల్ల రావడంతో మంచు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇప్పుడు పుట్టిన ఆడపిల్లతో కలసి మొత్తం మంచు కుటుంబంలో నలుగురు మహాలక్ష్మిలు ఉన్నట్టే. మంచు లక్ష్మి సరోగసీ ద్వారా ఓ ఆడబిడ్డను కన్నారు. విరానికాకు ముగ్గురు ఆడపిల్లలు. ఓ బాబు. తనకు పాప పుట్టిన విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘Its a girl, Its a girl’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
It’s a GIRL!!!! It’s a GIRL!!!!!! ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💋💋💋💋💋💋💋💋
— Vishnu Manchu (@iVishnuManchu) August 9, 2019
విరానికా డెలివరీ గురించి ముందే చెప్పిన మంచు విష్ణు.. తన భార్య ప్రసవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ టెలీకాస్ట్ చేస్తానని ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. అలాంటి అద్భుతమైన ఐడియా ఇచ్చిన కాజల్ అగర్వాల్‌కు థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశాడు. అయితే, విరానికా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, మంచు మోహన్ బాబు క్లాస్ పీకడంతో తన ప్రతిపాదనను విరమించుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.