‘ఓట‌ర్’ టీజ‌ర్ టాక్.. మంచు విష్ణు అస‌లైన రాజ‌కీయం మొద‌లైంది..

మంచు విష్ణు కొన్ని రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈయ‌న సినిమాలేవీ పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో ఇప్ప‌ట్లో సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల కింద ఈయ‌న న‌టించిన ఓట‌ర్ సినిమా ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 14, 2019, 5:43 PM IST
‘ఓట‌ర్’ టీజ‌ర్ టాక్.. మంచు విష్ణు అస‌లైన రాజ‌కీయం మొద‌లైంది..
మంచు విష్ణు ఓటర్ మూవీ
  • Share this:
మంచు విష్ణు కొన్ని రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈయ‌న సినిమాలేవీ పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో ఇప్ప‌ట్లో సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల కింద ఈయ‌న న‌టించిన ఓట‌ర్ సినిమా ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత సినిమా ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ వ‌చ్చేసింది. పూర్తిగా స‌ర్కార్ సినిమా నేప‌థ్యంలోనే ఇది కూడా సాగ‌నుంది. ఓటు హ‌క్కు విలువేంటి అనేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు జిఎస్ కార్తిక్.
Manchu Vishnu Voter movie teaser released and Story is based on Political Backdrop pk.. మంచు విష్ణు కొన్ని రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈయ‌న సినిమాలేవీ పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో ఇప్ప‌ట్లో సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల కింద ఈయ‌న న‌టించిన ఓట‌ర్ సినిమా ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. manchu vishnu,manchu vishnu twitter,voter movie teaser,voter movie teaser released,voter id card,ap elections 2019,manchu vishnu instagram,manchu vishnu movies,manchu vishnu voter movie,manchu vishnu elections 2019,manchu vishnu political entry,manchu vishnu voter release date,telugu cinema,మంచు విష్ణు,ఓటర్ మూవీ టీజర్ విడుదల,మంచు విష్ణు ఓటర్ సినిమా,ఓటర్ ఎలక్షన్ 2019,మంచు విష్ణు ఓటర్ సినిమా విడుదల
మంచు విష్ణు ఓటర్ మూవీ


ఎలాగూ మోహ‌న్ బాబు కుటుంబానికి రాజ‌కీయాలు కొత్త కాదు. ఆయ‌న కూడా కొన్ని రోజులు పొలిటిక‌ల్ స‌ర్కిల్లో ఉన్నాడు. ఎంపిగా కూడా చేసాడు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు మంచు మ‌నోజ్ కూడా రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క విష్ణు మాత్రం ఏం పాపం చేసాడు.. అందుకే ఈయ‌న కూడా రాజ‌కీయాల వైపు వ‌స్తున్నాడు. అయితే ఇదంతా నిజంగా మాత్రం కాదు.. సినిమా కోస‌మే. ఆచారి అమెరికా యాత్ర సినిమా త‌ర్వాత కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్న ఈయ‌న‌.. ప్ర‌స్తుతం ఓట‌ర్ అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తై కూడా చాలా రోజులు అయిపోయింది.

అనుకోని కార‌ణాల‌తో సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. జిఎస్ కార్తీక్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అది కూడా ప‌క్కాగా పొలిటికల్ సీజ‌న్ చూసుకుని ఎప్రిల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఓట్ వ్యాల్యూ చెబుతూ ఈ చిత్రం వ‌స్తుంది. సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. క‌చ్చితంగా ఈ చిత్రంతో విష్ణు మాయ చేస్తాడ‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి ఈయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎలాంటి మార్పు తీసుకొస్తాడో చూడాలిక‌.
First published: March 14, 2019, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading