MANCHU VISHNU VOTER MOVIE COMPLETED CENSOR AND POLITICAL TRILLER WILL READY TO RELEASE IN JUNE PK
మంచు విష్ణు వేడి వేడి రాజకీయాలు.. ‘ఓటర్’ వచ్చేస్తున్నాడహో..
మంచు విష్ణు ఓటర్ మూవీ
మంచు విష్ణు కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈయన సినిమాలేవీ పెద్దగా అలరించకపోవడంతో ఇప్పట్లో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల కింద ఈయన నటించిన ఓటర్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది.
మంచు విష్ణు కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈయన సినిమాలేవీ పెద్దగా అలరించకపోవడంతో ఇప్పట్లో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల కింద ఈయన నటించిన ఓటర్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్తైపోయింది. సినిమా చూసాక సెన్సార్ సభ్యులు కూడా బాగుందని మెచ్చుకోవడంతో సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నాడు విష్ణు. ఇక ఈ మధ్యే విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. పూర్తిగా సర్కార్ సినిమా నేపథ్యంలోనే ఇది కూడా సాగనుంది. ఓటు హక్కు విలువేంటి అనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు జిఎస్ కార్తిక్.
మంచు విష్ణు ఓటర్ మూవీ
ఎలాగూ మోహన్ బాబు కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు. ఆయన కూడా కొన్ని రోజులు పొలిటికల్ సర్కిల్లో ఉన్నాడు. ఎంపిగా కూడా చేసాడు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు మంచు మనోజ్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క విష్ణు మాత్రం ఏం పాపం చేసాడు.. అందుకే ఈయన కూడా రాజకీయాల వైపు వస్తున్నాడు. అయితే ఇదంతా నిజంగా మాత్రం కాదు.. సినిమా కోసమే. ఆచారి అమెరికా యాత్ర సినిమా తర్వాత కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్న ఈయన.. ప్రస్తుతం ఓటర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తై కూడా చాలా రోజులు అయిపోయింది.
అనుకోని కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. జిఎస్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం పొలిటికల్ హీట్ బాగానే నడుస్తుంది. ఇలాంటి సమయంలో వస్తే కచ్చితంగా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నారు యూనిట్. ఓట్ వ్యాల్యూ చెబుతూ ఈ చిత్రం వస్తుంది. సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో విష్ణు మాయ చేస్తాడని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి మార్పు తీసుకొస్తాడో చూడాలిక.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.