ప్రపంచానికి కరోనా వైరస్ ఇచ్చిన చైనానే.. టిక్ టాక్‌ను కూడా ఇచ్చింది. ఈ లాక్‌డౌన్ సమయంలో జనానికి మరింతగా పిచ్చెక్కిపోకుండా.. బోర్ కొట్టకుండా టిక్ టాక్ చాలా హెల్ప్ అవుతుంది. అందులో వచ్చే ఫన్నీ వీడియోలను చూసుకుంటూ హాయిగా కొందరు గడిపేస్తుంటే.. మరికొందరు మాత్రం తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు టిక్ టాక్‌లో ఉన్నారు. తెలుగు సినిమా నుంచి కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అందరిలా రావడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ చాలా చిత్రంగా వచ్చాడు విష్ణు.
ఈయన ఫస్ట్ టిక్ టాక్ వీడియో చాలా భిన్నంగా చేసాడు. క్రియేటివిటీ చూపించాడు మంచు వారబ్బాయి. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈయన చేసిన టిక్ టాక్ వీడియోలో ఏకంగా 5 మంది విష్ణులు ప్రత్యక్షమవుతారు. ఈ వీడియో గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Vishnu, Telugu Cinema, Tik tok, Tollywood