Home /News /movies /

Manchu Vishnu as MAA President : ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలు పై తొలి సంతకం..

Manchu Vishnu as MAA President : ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలు పై తొలి సంతకం..

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు (Twitter/Photo)

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు (Twitter/Photo)

Manchu Vishnu as MAA President : గత కొన్ని రోజులుగా ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై టాలీవుడ్‌లో పెద్ద యుద్ధమే నడుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ పై 107 ఓట్ల తేడాతో గెలిపొందిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసారు.

ఇంకా చదవండి ...
    Manchu Vishnu as MAA President : గత కొన్ని రోజులుగా ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై టాలీవుడ్‌లో పెద్ద యుద్ధమే నడుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ పై 107 ఓట్ల తేడాతో గెలిపొందిన సంగతి తెలిసిందే కదా. మా ఎన్నికలు ముగిసిన ఆ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదంతోనే తనను అధ్యక్షుడిగా ఓడించారంటూ ప్రకాష్ రాజ్ తన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. అంతకు ముందు మెగా బ్రదర్ నాగబాబు కూడా కుళ్లు, కుతంత్రాలు నిండిన ‘మా’లో సభ్యుడిగా కొనసాగలేనంటూ రాజీనామా లేఖ సందించిన సంగతి తెలిసిందే కదా. కానీ మంచు విష్ణు మాత్రం ప్రకాష్ రాజ్ చేసిన రాజీనామాపై పునరాలోచించుకోవాలని పిలుపు నిచ్చారు.

    ఆ సంగతి పక్కన పెడితే.. ఈ నెల 10న ‘మా ఎన్నికలు జరగడంతో పాటు అదే రోజు ఫలితాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ పత్రం అందజేశారు.ఈ నేపథ్యంలో ఈ రోజు మంచు విష్ణు .. ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

    ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..

    ఎలాంటి సమాచారం లేకుండా.. ఎంతో సాదాసీదాగా మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు సీనియర్ నటులకు ఇచ్చే పెన్షన్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మీ మద్దతు నాకు కావాలి. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తనకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానంటూ చెప్పుకొచ్చారు.



    మొత్తంగా ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మిగిలిన సభ్యులు ఎపుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  ‘మా’ ఎలక్షన్స్ విషయానికొస్తే..  సాధారణ ఎలక్షన్స్‌ను తలపించాయి.

    చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    అంతేకాదు ఈ ఎన్నికల్లో చిరంజీవి మెగా కాంపౌండ్ మద్దతుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై గెలిచారు. ఈ సారి జరిగిన  మా అసోసియేషన్ ఎన్నికల్లో కంటికి కనిపించని యుద్ధం జరిగింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: MAA Elections, MAA President, Manchu Vishnu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు