Manchu Vishnu - Ginna Censor Report | మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కొంత కాలం తర్వాత నటిస్తున్న సినిమా 'జిన్నా' (Gali Nageswara Rao). ఈ చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటించారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కించారు. ముందుగా ఈ సినిమా అక్టోబర్ 5, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే అదే రోజు రెండు పెద్ద సినిమాలు.. చిరంజీవి గాడ్‌ఫాదర్, నాగార్జున ఘోస్ట్ విడుదలవుతుండడంతో థియేటర్స్ విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 21, 2022కి పోస్ట్ పోన్ చేసారు.
ఈ లోగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొంచెం ఎడిట్ చేయించినట్టు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల మరికొన్ని గంటలు ఉందనగా ఈ సినిమాను సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు.
ఇక జిన్నా విషయానికి వస్తే.. సినిమా చిత్తూరు యాసలో సాగుతోంది. ‘‘నాకు దుడ్లు ముఖ్యమే కానీ, నా అనుకున్న వాళ్లు దుడ్లు కన్నా ఎక్కువ ముఖ్యం’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హారర్ కామెడీ జానర్లో తెరకెక్కించారు. సెన్సార్ వాళ్లు ఈ సినిమా హార్రర్ కామెడీగా రూపుదిద్దుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. నటుడు విష్ణుతో పాటు.. కమెడియన్స్, చంద్ర, సద్దాంల టైమింగ్ సినిమాకు ప్లస్ కానుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ చిత్రంతో సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు.ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రబృందం, ఈ సినిమా పై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. అందులో భాగంగా ఈ సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తూనే ఉంది. ఈ చిత్రం నుంచి విడుదలై ప్రచార చిత్రాలు కూడా మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే సినిమాలో హారర్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని తెలుస్తోంది. టీజర్, ట్రైలర్‌ను చూస్తుంటే విష్ణు హిట్ కొట్టేలా ఉన్నారు. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు అనూప్ మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతో విష్ణు కూతుళ్లు అరియానా,విరియానా సింగర్స్గ పరిచయం కాబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. హాస్య కథాచిత్రాల స్పెషలిస్ట్ గా పేరు గాంచిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే - సంభాషణలు అందించారు.
Raja Babu birth anniversary: రాజబాబు జయంతి.. ఈ నవ్వుల రేడుకు ఎన్ని వందల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..
మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు. ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నారు విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇక విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. అయితే ఒకట్రెండు మంచి విజయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు.
విష్ణు ఢీ, దేనికైనా రెడీ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న తర్వాత కూడా కెరీర్‌ను అనుకున్న దారిలో సెట్ చేసుకోలేకపోయారు. వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. ఆ మధ్య 50 కోట్లతో నిర్మించిన మోసగాళ్లు కూడా పెద్దగా ఉపయోగపడలేదు. భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన మోసగాళ్ళు ఏమాత్రం అలరించలేకపోయింది. అయితే తన కెరీర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి.. ఇప్పటి వరకు స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోకపోవడానికి ఆత్మ విశ్లేషణ చేసుకున్నారు విష్ణు. దీనికి సమాధానం ఓ షోలో చెప్పారు. కొందరు దర్శకుల కారణంగానే తన కెరీర్ ఇలా అయిపోయిందని.. తాను చేసిన కొన్ని తప్పులు.. దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు విష్ణు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ginna Movie, Manchu Vishnu, Payal Rajput, Sunny Leone, Tollywood