హోమ్ /వార్తలు /సినిమా /

Ginna Teaser: మంచు విష్ణుకు సన్నీలియోన్ లిప్ కిస్.. టైమ్ స్టార్ట్ అయింది గురూ!

Ginna Teaser: మంచు విష్ణుకు సన్నీలియోన్ లిప్ కిస్.. టైమ్ స్టార్ట్ అయింది గురూ!

Manchu Vishnu Ginna Teaser (Photo Twitter)

Manchu Vishnu Ginna Teaser (Photo Twitter)

Manchu Vishnu: జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు మంచు విష్ణు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఓ వైపు సినిమా హీరోగా చేస్తూనే మరోవైపు మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu). హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా (Ginna) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సినిమాలో హీరోగా చేస్తూనే సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు మంచు విష్ణు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ఇద్దరు బ్యూటీలు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సన్నీలియోన్‌ (Sunny Leone) కథానాయికలుగా నటిస్తున్నారు.చిత్రాన్ని గ్రాండ్ గా రూపొందిస్తూనే ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ జిన్నా మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ లో ఆసక్తికర సన్నివేశాలు చూడొచ్చు. మంచు విష్ణుకి సన్నీ లియోన్ లిప్ కిస్ ఇచ్చే సీన్ హైలైట్ అవుతోంది. ఈ టీజర్‌ను చూస్తుంటే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది.


ఈ సినిమాలో మంచు విష్ణు మరోసారి తన కామెడీ యాంగిల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఊరి నిండా అప్పులు చేసి.. టెంట్ హౌస్ నడుపుకునే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. చిత్రంలో రఘుబాబు, చమ్మక్ చంద్ర కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం.


ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంసథలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అనూప్ రూబెన్స్ బాణీలు కడుతుండగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. పచ్చళ్ల స్వాతి పాత్రలో పాయల్ కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ రోల్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కానుందట. అక్టోబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.
కాగా.. ఈ జిన్నా టైటిల్‌పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి మంచు విష్ణుకు ట్వీట్ చేస్తూ జిన్నా పేరుతో సినిమా టైటిల్‌ను మంచు విష్ణు వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. జిన్నా సినిమా టైటిల్ లోగోను తిరుమల ఏడుకొండల మధ్య ఉంచడమేంటని ప్రశ్నించారు. మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడు. జిన్నా వల్ల హిందువులు ప్రాణాలు, మానాలు కోల్పోయారు. దేశభక్తి కల వారు ఎవరూ దీనిని హర్షించరు అని విష్ణువర్ధన్‌ రెడ్డి పేర్కొనడంతో ఈ టైటిల్‌కి వివాదం చుట్టుకుంది. అయితే సినిమా టైటిల్‌కి, మహమ్మద్‌ ఆలీ జిన్నాకు ఎలాంటి సంబంధం లేదని ఈ సినిమా రైటర్ కోన వెంకట్ అన్నారు. సో.. చూడాలి మరి మంచు విష్ణుకి ఈ సినిమా అయినా విజయం సాధించి పెడుతుందా? లేదా అనేది!.

Published by:Sunil Boddula
First published:

Tags: Manchu Vishnu, Payal Rajput, Sunny Leone

ఉత్తమ కథలు