హోమ్ /వార్తలు /సినిమా /

మెగా హీరోకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..

మెగా హీరోకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..

మంచు విష్ణు ఓటర్ మూవీ

మంచు విష్ణు ఓటర్ మూవీ

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ ఉంది.  అంతేకాదు ఈ ఇద్దరు ఎన్నో సినిమాల్లో కలిసి ప్రేక్షకులను అలరించారు. ఇపుడు మరోసారి చిరంజీవి సినిమాలో మోహన్ బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా మోహన్ బాబు పెద్ద తనయుడు మంచు విష్ణు..మెగా ఫ్యామిలీ హీరోకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఇంకా చదవండి ...

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ ఉంది.  అంతేకాదు ఈ ఇద్దరు ఎన్నో సినిమాల్లో కలిసి ప్రేక్షకులను అలరించారు. ఇపుడు మరోసారి చిరంజీవి సినిమాలో మోహన్ బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా మోహన్ బాబు పెద్ద తనయుడు మంచు విష్ణు.. మెగా ఫ్యామిలీ హీరో అయిన సాయి ధరమ్ తేజ్‌కు ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. గతకొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమయిన సాయి తేజ్.. చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మరో హిట్టును అందుకున్నాడు. తాజాా సుబ్బు అనే కొత్త దర్శకుడితో ‘సోలో బ్రతుకు సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఐతే.. వాలంటైన్ వీక్ సందర్భంగా సోలో బ్రతుకు గురించి సాయి తేజ్.. ఒక ఫిలాసఫీ చెప్పాడు. సింగిల్‌గా ఉంటే ఉండే లాభాలు ఏంటి అని పాయింట్స్‌‌ను మెన్షన్ చేసాడు. దానికి మంచు హీరో విష్ణు గట్టి కౌంటరే ఇచ్చాడు.  తమ్ముడు మై లిటిల్ బ్రదర్ సాయి తేజ్.. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నకాను. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ సోలో బ్రతుకే సో బెటర్’ అని విష్ణు ట్వీట్ చేసాడు. దానికి మెగా మేనల్లుడు సాయి తేజ్.. కూల్‌గా ఈ విధంగా అన్నాడు. విష్ణు అన్న మీ మాదిరిగా అందరికీ అదృష్టం ఉండాలి కదా అంటూ కొంచెం కొంటెగా సమాధాన మిచ్చాడు. ఇపుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


First published:

Tags: Chiranjeevi, Manchu Vishnu, Mohan Babu, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు