Home /News /movies /

MANCHU VISHNU SENSATIONAL TWEET ABOUT LEGENDRY DASARI NARAYANA RAO BIRTH ANNIVERSARY TA

Manchu Vishnu : ఇండస్ట్రీ పెద్ద ఆయన ఒక్కడే.. మంచు విష్ణు సంచలన ట్వీట్..

మంచు విష్ణు (Manchu Vishnu Twitter)

మంచు విష్ణు (Manchu Vishnu Twitter)

Manchu Vishnu :  టాలీవుడ్ హీరో.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇపుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

    Manchu Vishnu :  టాలీవుడ్ హీరో.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇపుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు దర్శక రత్న దివంగత దాసరి నారాయణ రావు జయంతి. ఈ రోజు దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ రావును ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ ఇండస్ట్రీ పెద్దగా అప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణ రావు గారే ఉంటారు అంటూ ట్వీట్ చేసారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మంచు విష్ణుపై విరుచుకుపడుతున్నారు. దాసరి నారాయణ రావు మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దను కోల్పోయింది. ఆ స్థానంలో చిరంజీవి టాలీవుడ్ పెద్దగా ఇండస్ట్రీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

    మరోవైపు చిరంజీవి కూడా నేను ఇండస్ట్రీని పెద్దను కాదు..  ఇండస్ట్రీ బిడ్డను. ఓ బిడ్డగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సాయం చేస్తున్నట్టు ప్రకటించుకున్నారు. ఇందులో ఎవరు పెద్ద, చిన్నా అనే తేడా లేదు అంటూ తన హుందాతనం చాటుకున్నారు. ఇక మంచు విష్ణు ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.


    ఇక దాసరి నారాయణ రావు విషయానికొస్తే.. ఆయనలా ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించడం ఎవరి వల్ల కాదనేది జగమెరిగిన సత్యం. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యవహారాలతో పాటు క్యాటరింగ్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కబెట్టిన ఘనత గురువుగారైన దాసరికి దక్కుతుందని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏమైనా తెలుగు సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావుకు సరిలేరు నీకెవ్వరు. పైగా ఆయన వెళ్లిన తర్వాత ఎవరో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిందే. చిరంజీవి ఆ స్థానాన్ని భర్తీ చేయకపోయినా.. ఉన్నంతలో ఇండస్ట్రీ తరుపున ఆ తన వంతుగా అందరికీ సాయం చేస్తున్నారు. రీసెంట్‌గా మంచు విష్ణు ఆచార్య సినిమాకు నెగిటివ్ టాక్  సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ చిరంజీవిని ఉద్దేశించి చేసిందనే టాక్ వినబడింది. ఏమైనా ఒక హీరోలకు హిట్ ఫ్లాపులనేవి చాలా కామన్. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే హీరోల పని.

    RRR - OTT : ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..


    ఇక  మంచు విష్ణు నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన 'గాలి నాగేశ్వర రావు' అనే చిత్రంలో నటిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు.. ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నారు విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dasari Narayana Rao, Manchu Vishnu, Tollywood

    తదుపరి వార్తలు