రామ్ చరణ్ నటనపై మంచు విష్ణు సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏమన్నాడంటే..

కేంద్ర ప్రభుత్వం తాజాగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రం ‘మహానటి’ సినిమాకు గాను కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మరోవైపు రంగస్థలంలో నటనకు గాను రామ్ చరణ్ నటనపై మంచు విష్ణు సంచలన ట్వీట్ చేసాడు.

news18-telugu
Updated: August 11, 2019, 12:51 PM IST
రామ్ చరణ్ నటనపై మంచు విష్ణు సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏమన్నాడంటే..
మంచు విష్ణు,రామ్ చరణ్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
అంతేకాదుఈ సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్‌కు ఏకంగా జాతీయ ఉత్త నటి అవార్డు అందుకుంది. అది కూడా ఆషామాషీగా వచ్చింది కాదు.. ఈ అవార్డు అందుకోవడానికి కీర్తి సురేష్.. ‘అంధాధున్‌’లో నటించిన టబుతో పాటు ‘పద్మావత్‌’గా మెప్పించిన దీపికి పదుకొణేల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఈ అవార్డు కైవసం చేసుకుంది. మరోవైపు ఉత్తమ నటుడుగా ‘యూరీ’ సినిమాలో నటకు విక్కీ కౌశల్‌తో పాటు ‘అంధాదున్’లో నటనకు గాను ఆయుష్మాన్ ఖురానా ఎంపికయ్యారు. తాజాగా ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్‌కు మంచు విష్ణు బెస్ట్ విషెస్ అందచేసాడు. మరోవైపు ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చి ఉంటే బాగుండేదన్నారు.

అదే సమయంలో ఉత్తమ నటులుగా ఎంపికైన విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానాల నటనను నేనే తక్కువ చేయడం లేదన్నారు. నిజాయితీగా నా అభిప్రాయం ఏమిటంటే.. నా సోదరుడు రామ్ చరణ్..‘రంగస్థలం’చిత్రంలో నటనకు ఉత్తమనటుడిగా ఎంపికయ్యేందకు అన్ని విధాల అర్హుడు అన్నాడు. ఏమైనా ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నటనను అందరు మెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. అంతకు మించిన అవార్డు ఏమి లేదన్నాడు. మంచు విష్ణు ట్వీట్‌ను మెగాభిమానులు మీరు చెప్పింది 100% కరెక్ట్ అంటూ ప్రశంసిస్తున్నారు.
First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading