Super Star Mahesh - Manchu Vishnu: భలే మంచి విందు... మంచు విందు.. అంటున్న మహేష్

Manchu Vishnu Reveals Secret behind Mahesh babu glamour

Super Star Mahesh - Manchu Vishnu: రీసెంట్‌గా మంచు విష్ణు ఇచ్చిన పార్టీకి సూపర్‌స్టార్‌ మహేశ్‌, నమ్రత హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మహేశ్‌ గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటో చెప్పాడు

  • Share this:
    మంచు వారింట విందు.. చాలా మంచిగా ఉంది.. థాంక్యూ అంటున్నారు మహేష్‌. ఇంతకీ మంచు వారింట ఏం విశేషం జరిగిందని ఘట్టమనేని హీరో హాజరయ్యారు? అదీ సతీ సమేతంగా అనేది ఫిల్మ్ నగర్‌లో డిస్కషన్‌ దారితీసింది. మామూలుగా మహేష్‌ ఫ్యామిలీని చరణ్‌తోనో, ఎన్టీఆర్‌తోనో, నాగార్జున ఫ్యామిలీతోనూ చూసుంటారు. అలా కాకుంటే డైరక్టర్లలో మెహర్‌ రమేష్‌, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు క్లోజ్‌గా ఉంటాయి. కానీ ఇలాంటి మామూలు కాంబినేషన్లను అతీతంగా మహేష్‌ అండ్‌ నమ్రత విత్‌ మంచు విష్ణు ఫ్యామిలీ దర్శనమిచ్చారు. ఇదెలా సాధ్యమైందన్నది అందరికీ అంతుబట్టని ప్రశ్నగా మారింది. విషయం ఏంటని ఆరాతీస్తే మంచు విష్ణు సతీమణి వెరోనికా పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ పుట్టినరోజు విందు కార్యక్రమానికి దిల్‌రాజు కుమార్తె, అల్లుడు... హీరో గోపీచంద్‌ కూడా హాజరయ్యారు.

    వాళ్లందరూ సరదాగా ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఒక ఫొటోలో మహేష్‌, విష్ణు దంపతులు ఉన్నారు. ఆ ఫొటోను ట్యాగ్‌ చేస్తూ ... ఈఫొటోలో ఉన్న వ్యక్తి ఏళ్లు గడిచేకొద్దీ మరీ యువకుడిలా మారిపోతున్నారు. అందుకు కారణం ఆయనకున్న మంచితనం అంటూ రాసుకున్నారు విష్ణు. అందుకు మహేష్‌ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా రెస్పాండ్‌ అయ్యారు. మంచి విందుకు ధన్యవాదాలు అని అన్నారు.


    ఇప్పటిదాకా మంచు విష్ణు పలువురితో సరదాగా మాట్లాడటం నెటిజన్లకు అలవాటే . కానీ తొలిసారి మంచు విష్ణు కామెంట్‌ పెట్టడం, అందుకు మహేష్ రెస్పాండ్‌ కావడం మాత్రం నెటిజన్లకు కొత్తగా అనిపించింది. అన్నట్టు మహేష్‌ ఇంకా సర్కారు వారి పాట షూటింగ్‌కి వెళ్లలేదు. విష్ణు మాత్రం ప్రెజెంట్‌ చేసిన ప్రాజెక్టుల రిలీజ్‌కి వెయిట్‌ చేస్తున్నారు.
    Published by:Anil
    First published: