హోమ్ /వార్తలు /సినిమా /

Ginna: ట్రెండ్ అవుతున్న గోళీసోడా సాంగ్.. పాయల్‌తో మంచు విష్ణు రొమాంటిక్ స్టెప్స్

Ginna: ట్రెండ్ అవుతున్న గోళీసోడా సాంగ్.. పాయల్‌తో మంచు విష్ణు రొమాంటిక్ స్టెప్స్

Ginna Golisoda Song (Photo Twitter)

Ginna Golisoda Song (Photo Twitter)

Manchu Vishnu Golisoda Song: సినిమాల పరంగా చూస్తే కాస్త స్పీడు తగ్గించి విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో ఆయన లేటెస్ట్ మూవీ జిన్నా నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఓ వైపు సినిమా హీరోగా చేస్తూనే మరోవైపు మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాల పరంగా చూస్తే కాస్త స్పీడు తగ్గించి విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. హీరోగా ఇప్పటిదాకా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా (Ginna) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి గోళీసోడా సాంగ్ రిలీజ్ చేశారు.

సినిమాలో హీరోగా చేస్తూనే సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు మంచు విష్ణు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ఇద్దరు బ్యూటీలు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సన్నీలియోన్‌ (Sunny Leone) కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ కోసం డిఫరెంట్ మార్గాల్లో ముందుకెళ్తోంది జిన్నా టీం. ముఖ్యంగా సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేపడుతున్నారు.

ఇందులో భాగంగా తాజాగా గోళీసోడా సాంగ్ రిలీజ్ చేశారు. ఓ గోలీ సోడావే .. గుండెకాయ పానూ బీడావే ..మైండు కాస్త పిచ్చెక్కించే అందాలు మెక్కేశావే అంటూ సాగిపోతున్న ఈ పాటలో హీరోయిన్ పాయల్‌తో మంచు విష్ణు రొమాంటిక్ స్టెప్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనూప్ రూబెన్స్ బాణీలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన జిన్నా మూవీ టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమాలో మంచు విష్ణు మరోసారి తన కామెడీ యాంగిల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఊరి నిండా అప్పులు చేసి.. టెంట్ హౌస్ నడుపుకునే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. చిత్రంలో రఘుబాబు, చమ్మక్ చంద్ర కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అనూప్ రూబెన్స్ బాణీలు కడుతుండగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. పచ్చళ్ల స్వాతి పాత్రలో పాయల్ కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ రోల్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కానుందని అంటున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Manchu Vishnu, Payal Rajput, Sunny Leone

ఉత్తమ కథలు