హోమ్ /వార్తలు /సినిమా /

Maaలో మళ్లీ రచ్చ: Manchu Vishnu సంచలనం -నటి శ్రీనిజపై వేటు -మోహన్ బాబును బండబూతులు తిట్టడంతో

Maaలో మళ్లీ రచ్చ: Manchu Vishnu సంచలనం -నటి శ్రీనిజపై వేటు -మోహన్ బాబును బండబూతులు తిట్టడంతో

మంచు విష్ణు, శ్రీనిజ

మంచు విష్ణు, శ్రీనిజ

మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన చర్యకు ఉపక్రమించారు. మంచు మోహన్ బాబును బండబూతులు తిట్టిన ఓ చిన్న నటిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. సాధారణంగా ఎవరైనా సభ్యులు ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు వారిని పిలిచి.. మందలించడం అనేది ఒక సంప్రదాయంగా ఉండేది. కానీ శ్రీనిజ విషయంలో ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడం..

ఇంకా చదవండి ...

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి నెల రోజులు కొవొస్తున్నా వివాదాలు మాత్రం ఇంకా సమసిపోలేదు. మా అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నటి శ్రీనిజ మా నుంచి బహిష్కరించారు. ఆమెను ‘మా’ శాశ్వత సభ్యత్వం నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్యానెల్ గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారం నాడు వేదిక దగ్గర నటి శ్రీనిజ రచ్చకు దిగడం, మంచు మోహన్ బాబును బండ బూతులు తిట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో విష్ణు ప్యానెల్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. మా బైలాస్ ను మార్చుతామన్న విష్ణు తొలి అడుగులోనే అసమ్మతిదారులపై విరుచుకపడటం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

పలు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లతో గుర్తింపు పొందిన నటి శ్రీనిజ.. ‘డైవర్షన్ ఆంటీ’గా సోషల్ మీడియాలోనూ పాపులర్ అయ్యారు. చాలా కాలంగా మా సభ్యులిగా కొనసాగుతోన్న ఆమె.. మొన్నటి ఎన్నికల సమయంలో అనూహ్య చర్యలకు పాల్పడ్డారు. మంచు విష్ణు అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున శ్రీనిజ వేదిక దగ్గరికొచ్చి రభస చేసింది. మంచు మోహన్ బాబును బండ బూతులు తిడుతూ శ్రీనిజ రెచ్చిపోయిన వీడియోలు సంచలనం రేపాయి. పోలీసులు వారించినా ఆమె దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. నాటి ఘటనను తీవ్రంగా పరిగణిచన మా.. నటి శ్రీనిజను అసోసియేషన్ నుంచి బహిష్కరించింది.

మోహన్ బాబును బూతులు తిట్టినందుకు నటి శ్రీనిజను ‘మా’ శాశ్వత సభ్యత్వం నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 23వ తేదీన జరిగిన ‘మా’ ఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలస్యంగా వెల్లడైంది. ‘మా’ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ శ్రీనిజకు అక్టోబర్ 16వ తేదీన ఈసీ ఒక షోకాజ్ నోటీస్‌ పంపారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ.. సదరు నోటీసు జారీ చేశారు. దీనిపై..

ఈసీ నోటీసులకు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే నేరుగా చర్యలు ఉంటాయని శ్రీనిజకు పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఆ మేరకు స్పందించిన శ్రీనిజ గడువులోపే ఈసీకి వివరణ ఇచ్చుకుంది. కానీ ఆమె ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన ఈసీ, శ్రీనిజపై వేటు వేసింది. మంచు విష్ణు ప్యానల్ గెలిచిన తర్వాత ఒక శాశ్వత సభ్యురాలిపై ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. నిజానికి శ్రీనిజ.. తాను మోహన్ బాబును ఎందుకు తిట్టాల్సి వచ్చిందో పలు ఇంటర్వ్యూలలో వివరించారు. సాధారణంగా ఎవరైనా సభ్యులు ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు వారిని పిలిచి.. మందలించడం అనేది ఒక సంప్రదాయంగా ఉండేది. కానీ శ్రీనిజ విషయంలో ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడం పట్ల చాలా మంది విస్తయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో విష్ణు ప్యానెల్ ఇంకెన్ని సంచలనాలకు పాల్పడుతుందో చూడలి మరి..

First published:

Tags: MAA, MAA Association, MAA Elections, Manchu mohan babu, Manchu Vishnu

ఉత్తమ కథలు