• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MANCHU VISHNU MOSAGALLU MOVIE ENDED UP WITH BIGGEST DISASTER EVER IN TELUGU CINEMA PK

Mosagallu: 50 కోట్ల సినిమాకు కోటి రూపాయలు కూడా వచ్చేలా లేవు.. ఇది మరోచరిత్ర..

‘మోసగాళ్లు’ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

Mosagallu: సాధారణంగానే మంచు విష్ణు సినిమాలకు అంతగా డిమాండ్ ఉండదు. అప్పుడెప్పుడో వచ్చిన ఢీ.. పదేళ్ల కింద వచ్చిన దేనికైనా రెడీ తప్పిస్తే ఈయన కెరీర్‌లో హిట్స్ లేవు. ఇలాంటి సమయంలో ఈయన నటించి నిర్మించిన మోసగాళ్లు సినిమా కూడా మోసం చేసింది.

  • Share this:
భారీ గ్యాప్ తీసుకుని మంచు విష్ణు సినిమా మోసగాళ్లు సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో కచ్చితంగా తన కెరీర్‌లో అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకుంటానని ధీమాగా చెప్పిన ఈయనకు మరోసారి నిరాశనే మిగిల్చింది ఈ చిత్రం. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీను తీసుకొచ్చి భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన మోసగాళ్లు దారుణంగా డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా రాలేదు. తనకు మార్కెట్ లేదని తెలుసు.. అయినా కూడా కథపై నమ్మకంతో ముందుకెళ్తున్నానంటూ ప్రమోషన్స్‌లోనే చెప్పాడు మంచు విష్ణు. పైగా ఖర్చుకు వెనకాడకుండా తన సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా తీసుకున్నాడు. ప్రపంచాన్ని కుదిపేసిన బిగ్గెస్ట్ ఐటి స్కామ్ ఇందులో చూపించారు విష్ణు టీం. ఈ సినిమాకు కథ కూడా ఈయనే అందించాడు. భారీ హంగుల మధ్య మొన్న మార్చ్ 19కి విడుదలైన ఈ చిత్రం తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి. ఈ సినిమాకు 50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న విష్ణు.. ఇప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోతున్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. విష్ణుకు మార్కెట్ లేకపోవడం.. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ కనీసం పట్టించుకోలేదు.

manchu vishnu,manchu vishnu twitter,manchu vishnu mosagallu movie,manchu vishnu mosagallu movie collections,manchu vishnu mosagallu 50 crore budget,telugu cinema,మంచు విష్ణు,మంచు విష్ణు మోసగాళ్లు సినిమా,మోసగాళ్లు సినిమా కలెక్షన్స్
‘మోసగాళ్లు’ (Twitter/Photo)


దాంతో ప్రమోషనల్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకొచ్చేలా కనిపించడం లేదు మోసగాళ్లు. తొలిరోజు 42 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు 20 లక్షలకు పడిపోయింది. మూడో రోజు కూడా 20 లక్షలు మాత్రమే షేర్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత దారుణంగా నష్టాలు తీసుకొచ్చిన సినిమా మరోటి లేదేమో..? మంచు విష్ణు ఈ సినిమాను సొంతంగా విడుదల చేసుకున్నాడు. అయినా కూడా దీనికి 19 కోట్లకు పైగా షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అయినట్లు. కానీ ఇక్కడ కోటి కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమా ఇచ్చిన షాక్‌తో మరికొన్ని రోజులు విష్ణు సినిమాలకు దూరంగా ఉండిపోతాడేమో..?
Published by:Praveen Kumar Vadla
First published: