హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi Manchu Vishnu: చిరంజీవి మెగాస్టార్ ఎందుకు అయ్యాడో ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు

Chiranjeevi Manchu Vishnu: చిరంజీవి మెగాస్టార్ ఎందుకు అయ్యాడో ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు

బలహీనతలు: కుర్రాడు.. ఈయనకు ఏం తెలుసు.. సీనియర్స్ అయితే బాగుంటుందని కొందరు విష్ణుపై అన్యమనస్కంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బలహీనతలు: కుర్రాడు.. ఈయనకు ఏం తెలుసు.. సీనియర్స్ అయితే బాగుంటుందని కొందరు విష్ణుపై అన్యమనస్కంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మంచు మోహ‌న్ బాబు(Manchu Mohanbabu) మ‌ధ్య ఉన్న సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రు దాదాపుగా ఒకేసారి త‌మ త‌మ కెరీర్‌ల‌ను ప్రారంభించారు.

ఇంకా చదవండి ...

  Chiranjeevi Manchu Vishnu: టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహ‌న్ బాబు మ‌ధ్య ఉన్న సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రు దాదాపుగా ఒకేసారి త‌మ త‌మ కెరీర్‌ల‌ను ప్రారంభించారు. ఇక అప్ప‌ట్లో చిరంజీవితో క‌లిసి ఎన్నో చిత్రాల్లో న‌టించారు మోహ‌న్ బాబు. ఈ క్ర‌మంలో ఇరు కుటుంబాల మ‌ధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డింది. ఇప్పుడు చిరు పిల్ల‌లు, మోహ‌న్ బాబు పిల్ల‌లు బాగా క్లోజ్‌గా ఉంటారు. ఇరు కుటుంబాల్లో జ‌రిగే వేడుక‌ల్లో వీరు పాల్గొంటుంటారు.

  కాగా తాజాగా చిరంజీవిని క‌లిశాడు మంచు విష్ణు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన విష్ణు.. బిగ్‌బాస్ చిరంజీవి అంకుల్‌ని ఇవాళ క‌లిశా. ఆయ‌న‌ను ఎందుకు క‌లిశానో త్వ‌ర‌లోనే రివీల్ చేస్తా. ఆయ‌న‌ను ఎన్నో ప్ర‌శ్న‌లు అడిగి తెలుసుకోవ‌డం నాకు చాలా గ‌ర్వ‌కార‌ణం. ఆయ‌న ఎందుకు మెగాస్టార్ అయ్యారో ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అని కామెంట్ పెట్టారు.

  కాగా మంచు విష్ణు మోస‌గాళ్లు అనే మూవీలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి హాలీవుడ్ ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో విష్ణు, కాజ‌ల్ క‌వ‌ల‌లుగా న‌టించారు. ఇప్ప‌టికే దాదాపుగా షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం విష్ణు చిరును క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్రక‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. కాగా మరోవైపు మంచు విష్ణు శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో డీ సీక్వెల్‌లో న‌టించ‌నున్నారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Chiranjeevi, Manchu Vishnu, Megastar Chiranjeevi

  ఉత్తమ కథలు