Home /News /movies /

MANCHU VISHNU MAY HAVE THREE OPTIONS REGARDING RESIGNATIONS OF PRAKASH PANEL MEMBERS AK

Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా.. మంచు విష్ణు ముందున్న 3 మార్గాలు ఇవే..?

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం మంచు విష్ణు ముందు మూడు మార్గాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

    మా రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మా ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన మంచు విష్ణు.. ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ వర్గంపై విజయం సాధించారు. మా అధ్యక్ష పోటీలో ప్రకాశ్ రాజ్‌ను ఓడించారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లోని కొందరు విజయం సాధించారు. ఇప్పుడు వారంతా రాజీనామా చేయడంతో.. మా ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోని మంచు విష్ణు.. ఈ కొత్త సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించే విషయంలో మంచు విష్ణు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ సమస్య పరిష్కారం విషయంలో మంచు విష్ణు ముందు మూడు మార్గాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

    అందులో ఒకటి వీరి రాజీనామాలు ఆమోదించకుండా సమస్యను పరిష్కారం కోసం వారితో చర్చలు జరపడం. ఇందుకు మంచు విష్ణు స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇరు పక్షాల మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం జరిగిన తరువాత ఈ పరిస్థితి ఉంటుందా ? అన్నది సందేహమే.

    ఇక మంచు విష్ణు ముందున్న మరో మార్గం ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై ఎదురుదాడి చేయడం. తన గెలుపును ప్రత్యర్థి వర్గం జీర్ణించుకోలేకపోతోందని.. అందుకే ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని మంచు విష్ణు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. వారికి అందరిలో కలిసి పని చేసే ఉద్దేశ్యం లేదని.. అందుకే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ఆయన వారిపై ఎదురుదాడి చేయొచ్చు. అయితే మా వ్యవహారాలు ఇప్పటికే రచ్చకెక్కిన నేపథ్యంలో.. మంచు విష్ణు ఈ విధంగా వ్యవహరిస్తారా ? అన్నది చూడాలి.

    Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

    Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

    ఇక ఈ సమస్య పరిష్కారం కోసం మోహన్ బాబు రంగంలోకి దిగి పెద్దలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. చిరంజీవి, మోహన్ బాబు కూర్చుని మాట్లాడుకుంటే ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగిపోతుందనే వాదన కూడా ఉంది. అయితే ఇంత జరిగిన తరువాత పెద్దల ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందా ? అన్నది కూడా సందేహమే. అయితే ఏదో ఒక చోట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మొదలైన ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పడాల్సిందే అని సినీవర్గాలు కోరుకుంటున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: MAA Elections, Manchu Vishnu

    తదుపరి వార్తలు