Home /News /movies /

Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామాలపై మంచు విష్ణు వైఖరి ఇదేనా ?.. నరేశ్ సంకేతాలు

Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామాలపై మంచు విష్ణు వైఖరి ఇదేనా ?.. నరేశ్ సంకేతాలు

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

MAA Elections 2021: బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ వాళ్లు దేశం విడిచి వెళ్లపోతారా ? అంటూ తనదైన శైలిలో ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి రాజీనామా చేసిన వారికి నరేశ్ కౌంటర్ ఇచ్చారు.

  మా ఎన్నికల రచ్చ ఇప్పుడప్పుడే సమసిపోయేలా లేదు. ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామాలు చేయడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(MAA Elections)లో కొత్త వివాదం మొదలైంది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానల్ పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా పని చేసేందుకు.. తాము ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వీలుగా తాము రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు ప్రకటించారు. తమ స్థానంలో అధ్యక్షుడు ప్రకాశ్ రాజ్ ఎవరినైనా నియమించుకుని పని చేసుకోవచ్చని సూచించారు. దీంతో వీరి రాజీనామాల విషయంలో మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.

  అయితే ఈ విషయంలో మంచు విష్ణు వ్యూహం వేరుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికప్పుడు వీరి రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మంచు విష్ణు యోచిస్తున్నట్టు సమాచారం. ‘మా’‌లో గెలిచిన వారంతా కలిసి పని చేయాల్సి ఉంటుందనే విషయాన్నే ఆయనకు మద్దతుగా ఉన్న వాళ్లు చెబుతున్నారు. విష్ణు ప్యానల్‌కు గట్టి మద్దతు ఇచ్చిన మా మాజీ అధ్యక్షుడు నరేశ్.. గెలిచిన వాళ్లు ఇలా రాజీనామా చేయడాన్ని తప్పుబట్టారు.

  Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

  బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ వాళ్లు దేశం విడిచి వెళ్లపోతారా ? అంటూ తనదైన శైలిలో ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి రాజీనామా చేసిన వారికి కౌంటర్ ఇచ్చారు. అంతా కలిసి పని చేయాల్సిందే అని సూచించారు. నరేశ్ వ్యాఖ్యలను బట్టి మంచు విష్ణు కూడా ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా వారి రాజీనామాలు ఆమోదించకుండా.. వాటిని హోల్డ్‌లో పెట్టే ఆలోచనలో మంచు విష్ణు ఉన్నట్టు సమాచారం.

  Telangana: ఆ కారు బండి సంజయ్ మిత్రుడిదే.. బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్

  మరోవైపు ఇప్పటికప్పుడు ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నా.. లేక వారికి కౌంటర్ ఇచ్చినా.. అది మరో వివాదానికి తెర లేపుతుందనే యోచనలో మంచు విష్ణు అండ్ టీమ్ యోచిస్తున్నట్టు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయానికి అంతే వ్యూహాత్మకంగా చెక్ చెప్పాలనే భావనలో మంచు విష్ణు టీమ్ ఉన్నట్టు కనిపిస్తోంది.

  NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

  అలాగే ఎంతో మంది అభిమానులను కూడా ఆమె సంపాదించుకున్నారు. దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరుగా నిలిచారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిరుచులను, సంఘటనలను షేర్ చేసుకుంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు సమంత. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్మ్‌ ఫామ్‌ లో కొద్ది రోజుల వరకు మొదటి స్థానంలో ఉన్న కాజల్ అగర్వాల్ ను వెనక్కి నెట్టి సమంత నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆమె ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వేలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ లిస్టులో సమంత నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో కాజల్, అనుష్క, రష్మిక ఉన్నారు. విడాకుల తర్వాత కూడా ఆమె మొదటి స్థానం దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయమే. చూడాలి మరి ఆ స్థానం ఎంతకాలం కొనసాగుతుందో.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: MAA Elections, Manchu Vishnu, Prakash Raj

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు