హోమ్ /వార్తలు /movies /

గోడచాటున సన్నీలియోన్‌ను అలా చూసి.. పరుగులు తీసిన మంచు విష్ణు

గోడచాటున సన్నీలియోన్‌ను అలా చూసి.. పరుగులు తీసిన మంచు విష్ణు

హిందీ తెలుగుతో పాటు పలు భాషాల్లో నటిస్తూ.. సన్నీ లియోన్ ఫుల్ బిజీగా మారింది. తాజాగా మంచు విష్ణుతో కలిసి ఆమె మరో తెలుగు సినిమాలో నటిస్తోంది.

హిందీ తెలుగుతో పాటు పలు భాషాల్లో నటిస్తూ.. సన్నీ లియోన్ ఫుల్ బిజీగా మారింది. తాజాగా మంచు విష్ణుతో కలిసి ఆమె మరో తెలుగు సినిమాలో నటిస్తోంది.

హిందీ తెలుగుతో పాటు పలు భాషాల్లో నటిస్తూ.. సన్నీ లియోన్ ఫుల్ బిజీగా మారింది. తాజాగా మంచు విష్ణుతో కలిసి ఆమె మరో తెలుగు సినిమాలో నటిస్తోంది.

    టాలీవుడ్ మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణుతో కనిపించింది ప్రముఖ నటి సన్నీ లియోన్. ట్విట్టర్‌లో సన్నీ ఓ పోస్టు పెట్టింది. ఓ వీడియో పోస్టు చేసింది. అందులో మంచు విష్ణుతో పాటు.... సన్నీ ఉన్నారు. సన్నీ గోడచాటున దాక్కొని ఉండగా.. మంచు విష్ణు నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో ఫేస్‌కు ఓ మాస్క్ ధరించి అతడ్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అయితే మంచు విష్ణు ఆమెను అలా చూసి ఏ మాత్రం భయ పడడు. ఆ తర్వాత మాస్క్ తీయగానే.. భయంతో వణికిపోయి పరుగులు తీస్తాడు. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ.. నా ప్రయత్నం మరోసారి విఫలం అయ్యింది అని కామెంట్ చేసింది సన్నీ లియోన్. నెట్టింట ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ఇక సన్నీలియోన్ విషయానికి వస్తే.. ఈ పేరు సినీ అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన నటి సన్నీ. ఎందుకంటే ామె ఓ పోర్న్ స్టార్. అంతేకాదు.. సన్నీ బ్లూ ఫిల్మ్ నిర్మాత కూడా. ఆమె ఆ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్. అయితే, ఇప్పుడు ఆమె ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన సన్నీ లియోన్... ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో ఆఫర్లు సంపాదించింది. ప్రస్తుతం ఇండియాలో సెటిలై ఇక్కడి సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సన్నీ హిందీతో పాటు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తుంది. సన్నీ గతంలో తెలుగు సినిమాలు కూడా చేసిన విషయం తెలిసిందే.

    మంచు విష్ణు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. మోసగాళ్లు సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విష్ణు ఇప్పుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో గాలి నాగేశ్వరావు పాత్రలో విష్ణు కనిపించనుండగా.. విష్ణు క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే సన్నీ స్కెచ్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో సన్నీ రేణుక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరి సన్నీ-కోన కలిసి విష్ణుకి ఒక సక్సెస్ తీసుకొస్తారో లేదో వేచి చూడాల్సిందే.

    First published:

    ఉత్తమ కథలు