• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MANCHU VISHNU LOOKING TO BUILT A HOUSE IN HYDERABAD WITH MOSAGALLU PROFITS MHN

Mosagallu - Manchu Vishnu: ‘మోసగాళ్లు’ విజయంపై విష్ణు ధీమా.. 50 కోట్లతో ఇల్లు కట్టే ప్లాన్!

Manchu Vishnu looking to built a house in hyderabad with Mosagallu profits

Mosagallu - Manchu Vishnu: మోసగాళ్లు సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్న మంచు విష్ణు.. ఆ సినిమాతో వచ్చే లాభాలతో ఓ పనిచేయాలని అనుకుంటున్నాడు. ఇంతకీ మంచు విష్ణు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా..

  • Share this:
    లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇందులో మంచు వారబ్బాయి సరసన స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీసు పాత్రలో, నవదీప్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు హీరోగా నటించడంతో పాటు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండటంతో భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా హిట్ కొట్టి మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆచితూచి మరీ ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యమున్న కథను ఎంచుకున్నారు. సినిమాలో ప్రముఖులు నటించడం ఒక ఎత్తయితే.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, టీజర్‌తో మంచి టాక్ రావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రమోషన్స్‌ కూడా బాగానే చేస్తున్నారు.

    ఇప్పటి వరకూ సినిమా కోసం మొత్తం 50 కోట్లు బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. కచ్చితంగా హిట్ అవుతుందని ఇందుకు డబుల్ కలెక్షన్లు సినిమా వస్తాయని విష్ణు గట్టి ధీమాతో ఉన్నాడట. ఈ సినిమా హిట్టయితే తాను అనుకున్న కల నెరవడంతో పాటు.. త్వరలోనే ఓ ఇంటి వాడు అవ్వాలని కూడా ప్లాన్‌లు చేసుకుంటున్నాడట. అదేమిటంటే.. సినిమాకు వచ్చే లాభాలతో హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ ఎవరు కట్టని రేంజ్‌లో.. అత్యంత భారీగా ఇల్లు కట్టుకోవాలని మ్యాప్ గీసేసుకున్నాడట. ఆ ఇంట్లోనే తన తల్లిదండ్రులతో కలిసే ఉంటాడట. ప్రస్తుతం మోహన్ బాబు శంషాబాద్‌‌లో నివాసముంటున్నారు. మంచు మనోజ్, మంచు లక్ష్మీ ఇద్దరూ ఫిల్మ్‌నగర్‌లో ఉంటున్నారు. రేపొద్దున ఇల్లు కట్టుకుంటే అమ్మానాన్నలిద్దర్నీ తన దగ్గరే పెట్టుకుంటానని కూడా ఓ ప్రెస్‌మీట్‌లో విష్ణునే చెప్పారు.

    సినిమా విషయానికొస్తే.. సినిమా మొత్తం కుంభకోణాల నేపథ్యం కావడం, హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జెఫ్రీ జీ చిన్ తెరకెక్కించడంతో భారీగానే అంచనాలున్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయ్. అందుకే ఈ సినిమాతో తన దశ తిరుగుతుందని విష్ణు గట్టి ధీమాతో ఉన్నారు. ఈ నెల 19న‌ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్నడ‌, మ‌ళ‌యాలంలో ‘మోసగాళ్లు’ రిలీజ్ కాబోతోంది. మరి మంచు వారబ్బాయ్ అనుకున్నట్లు సినిమా హిట్టవుతుందో లేదో జస్ట్ వెయిట్ అండ్ సీ.
    Published by:Anil
    First published: