హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu: మంచు విష్ణు మంచి మనసు.. ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న నటికి తన వంతు సాయం..

Manchu Vishnu: మంచు విష్ణు మంచి మనసు.. ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న నటికి తన వంతు సాయం..

పాకీజాకు మంచు విష్ణు సాయం (File/Photo)

పాకీజాకు మంచు విష్ణు సాయం (File/Photo)

Manchu Vishnu : తెలుగు సినీ నటుడు  మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ అధ్యక్షడు మంచు విష్ణు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Manchu Vishnu : తెలుగు సినీ నటుడు  మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ అధ్యక్షడు మంచు విష్ణు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. తాజాగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న నటి పాకీజాకు తన వంతు సాయం అందించారు. వివరాల్లోకి వెళితే.. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ టాలెంట్‌తో పాటు పిసరంత అదృష్టం కూడా ఉండాలి. ఇక్కడ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన వాళ్లు.. ఆ తర్వాత కనిపించకుండా దిక్కు దివాణం లేకుండా పోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక్కడ ప్రతి శుక్రవారం స్టార్స్ జాతకాలు మారిపోతూ ఉంటాయి. నిన్నటి వరకు కార్లు బంగ్లాలతో ఉన్నవాళ్లు తిండికి టికానా లేకుండా పోయినవాళ్లున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే అన్న సూత్రాన్ని ఫాలో అవుతూ శోభన్ బాబు, మురళీ మోహన్ వంటి నటులు సినిమాలు చేస్తుండానే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి కోట్లకు కోట్లు వెనకెేసుకున్నారు.

ముందు చూపు ఉన్నవాళ్లు చివరి రోజుల్లో హాయిగా కాలం గడిపేవాళ్లు కొందరైతే.. చివరి రోజుల్లో డబ్బులు లేకుండా అడుక్కున్న వాళ్లు ఇండస్ట్రీలో కోకొల్లలు.  ఇక సినీ ఇండస్ట్రీలో చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డ వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది చిత్తూరు నాగయ్య. ఆ తర్వాత కాంతారావు, సావిత్రి, పద్మనాభం, నాగభూషణం, రాజనాల వంటి వారు కెరీర్‌ పీక్స్‌లో ఉన్నపుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించక పోవడంతో చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పావల శ్యామల, పాకీజా వంటి నటీమణులతో పాటు ఎంతో మంది నటులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది.

తాజాగా ఒకప్పటి కామెడీ నటి పాకీజా అలియాస్ వాసుకీ తాను గత కొన్ని రోజులుగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయాన్ని ఓ యూట్యూబ్‌ ఛానెల్ వేదికగా వెలుగులోకి వచ్చాయి. తిండికి కూడా లేని స్థితిలో ఆమె ఉన్నారని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమిళ ఇండస్ట్రీలో తన పరిస్థితిని వివరించినా.. ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాలేదన్నారు. ఇక ఈమె కష్టం గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెకు రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని అందజేసారు. ఆ తర్వాత చిరంజీవి పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు కూడా తన వంతుగా రూ. లక్ష సాయం అందజేసారు.

ఇక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న  పాకీజా పరిస్థితి తెలుసుకున్న మంచు విష్ణు తన సొంత డబ్బులతో పాకీజాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డును ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మా సభ్యురాలైన కరాటే కళ్యాణి తన సామాజిక మాధ్యమ అకౌంట్‌లో వెల్లడించింది. ‘మా’ కార్టు కోసం అసోసియేషన్‌కు రూ. 90 వేలు మంచు విష్ణు కట్టినట్టు తెలిపారు. రీసెంట్‌గా మంచు విష్ణు..  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించారు. మా సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఈ హెల్త్ చెకప్ ఉపయోగ పడుతుంది. మా ఆద్యుక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసెడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, మా కుటుంబ సభ్యులు అందరు కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ గురునాథ రెడ్డికి, రఘునాధ రెడ్డికి, హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
పాకీజాకు మంచు విష్ణు సాయం (File/Photo)

పాకీజా విషయానికొస్తే.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా స్వయంగా శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై  తెరకెక్కిన ‘అసెంబ్లీ రౌడీ’లో ఆడ కమెడియన్‌గా చాలా పాపులర్ అయింది పాకీజా. ఆమె అసలు పేరు వాసుకీ. అసెంబ్లీ రౌడీలో పాకీజాగా ఎపుడైతే నటించిందో ఆమె స్క్రీన్ నేమ్ అదే అయిపోయింది. ఈ సినిమాలో సైన్స్ టీచర్‌గా శుభ్రత, పరిశుభ్రత అంటూ బ్రహ్మాతో చేసిన కామెడీని ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’,‘పెదరాయుడు వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతేకాదు అప్పట్లో బాలకృష్ణ,చిరంజీవి,విజయశాంతి వంటి హీరోె, హీరోయిన్స్ నటించిన విమానం ప్రమాదానికి గురైన సందర్భంలో అందులో తాను కూాడా ఉన్నట్లు పాకీజా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

First published:

Tags: Manchu Vishnu

ఉత్తమ కథలు