• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MANCHU VISHNU KAJAL AGGARWAL MOSAGALU MOVIE CLOSING COLLECTIONS AND ITS ALL TIME DISASTER PK

Mosagallu closing collections: ‘మోసగాళ్లు’ క్లోజింగ్ కలెక్షన్స్.. చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్..

‘మోసగాళ్లు’ (Twitter/Photo)

Mosagallu closing collections: అసలే కరోనా (COVID 19) తర్వాత సినిమా థియేటర్స్‌కు వెళ్లాలంటే ఆడియన్స్ కాస్త ఆలోచిస్తున్నారు. అయితే సినిమా బాగుందంటే మాత్రం వెంటనే అక్కడ తేలుతున్నారు. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం కనీసం అటు వైపు కూడా వెళ్లడం లేదు. ఇప్పుడు మంచు విష్ణు (Manchu Vishnu) మోసగాళ్లు (Mosagallu) సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.

  • Share this:
మంచు విష్ణుకు హీరోగా ఎంత మార్కెట్ ఉందనేది పక్కన బెడితే మోసగాళ్లు సినిమా మాత్రం ఆయన్ని దారుణంగా మోసం చేసింది. సినిమా ఎలా ఉన్నా కనీసం కోటి రూపాయల షేర్ అయినా రావాలి కదా..? ఆయన గత సినిమాలు ఒక్కోసారి 10 కోట్లు కూడా వసూలు చేసాయి. ఎంత పెద్ద ఫ్లాప్ అయినా కనీసం కోటి మార్క్ అందుకున్నాయి. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు. హాలీవుడ్ నుంచి దర్శకుడు జెఫ్రీని తీసుకొచ్చి.. వరల్డ్ బిగ్గెస్ట్ ఐటి స్కామ్ అంటూ చెప్పిన మోసగాళ్లు సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి. అది చూసిన తర్వాత ఎంత దారుణంగా విష్ణుతో పాటు ప్రేక్షకులను కూడా ఈ సినిమా మోసం చేసిందో అర్థమైపోతుంది. ఏరియా వైజ్‌గా మోసగాళ్లు సినిమాకు వచ్చిన వసూళ్లు చూద్దాం..

నైజాం- 0.28 కోట్లు
సీడెడ్- 0.14 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.10 కోట్లు
ఈస్ట్- 0.08 కోట్లు
వెస్ట్- 0.04 కోట్లు
గుంటూరు- 0.07 కోట్లు
కృష్ణా- 0.07 కోట్లు
నెల్లూరు- 0.03 కోట్లు

ఏపీ + తెలంగాణ ఫైనల్ కలెక్షన్స్- 0.81 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.08 కోట్లు
ఓవర్సీస్- 0.11 కోట్లు

వరల్డ్ వైడ్ ఫైనల్ కలెక్షన్స్- 1 కోటి షేర్

ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నాడు మంచు విష్ణు. అయినా కూడా బ్రేక్ ఈవెన్ కావాలంటే 19 కోట్ల వరకు వసూలు చేయాలి. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ క్యాస్ట్ ఉండటంతో పాటు ట్రైలర్ కూడా బాగానే ఉండటంతో సినిమాకు ఓపెనింగ్స్ అయినా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ చిత్రం అత్యంత దారుణంగా డిజాస్టర్ అయింది. చరిత్రలో నిలిచిపోయే ఫ్లాప్ అయిపోయింది. కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే షేర్ వసూలు చేసింది మోసగాళ్లు.
Published by:Praveen Kumar Vadla
First published: