హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu: మంచు విష్ణు జిన్నా నుంచి లిరికల సాంగ్ రిలీజ్.. !

Manchu Vishnu: మంచు విష్ణు జిన్నా నుంచి లిరికల సాంగ్ రిలీజ్.. !

జిన్నా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

జిన్నా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

జిన్నా సినిమా నుంచి లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "నా పేరు జిన్నారా .. అందరికీ అన్నరా అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కొంత కాలం తర్వాత నటిస్తున్న సినిమా 'జిన్నా' (Gali Nageswara Rao). జిన్నా చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటిస్తున్నారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్నారు.

  ఇవాళ  జిన్నా సినిమా నుంచి లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "నా పేరు జిన్నారా .. అందరికీ అన్నరా .. నకరల్ జేస్తే కిస్సా  ఖల్లాసు రా .. " అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి ప్రేమ్ సాహిత్యాన్ని అందించగా పృథ్వీ చంద్ర ఆలపించాడు. అయితే అక్టోబర్ 5న విడుల కావల్సి ఉన్న జిన్నా సినిమాను కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

  ఇటీవలే ఈ సినిమా టీజర్ (Ginna Teaser) ని రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే సినిమాలో హారర్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని తెలుస్తోంది. టీజర్‌ను చూస్తుంటే విష్ణు హిట్ కొట్టేలా ఉన్నారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో 1.9 మిలియన్ వ్యూస్‌తో అదరగొడుతోంది. ఇక అనూప్ మంచి మ్యూజిక్ అందించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నారు.  హాస్య కథాచిత్రాల స్పెషలిస్ట్ గా పేరు గాంచిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే - సంభాషణలు అందిస్తున్నారు.

  అంతేకాదు జిన్నా  సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా పాడారట. సింగర్స్‌గా వాళ్ళకు తొలి పాటని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం అంటున్నారు. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారట. ఈ పాట సినిమాకి కీలకంగా ఉండనుందని అంతేకాదు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Manchu Vishnu

  ఉత్తమ కథలు