Home /News /movies /

MANCHU VISHNU JINNA FIRST LOOK RELEASE SB

Manchu Vishnu: జిన్నా షాట్ రెడీ... ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. సన్నాఫ్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ చేయాలన్న నెటిజన్..

    మంచు విష్ణు ‘జిన్నా’  సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రబృందం, ఈ సినిమా పై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. ఈ సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తోంది. అందులో భాగంగా చిత్రబృందం తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో విష్ణు స్టైల్‌గా కనిపించాడు. పైగా మంచు విష్ణు జిన్నా లుక్‌ని రివీల్ చేసేందుకు ‘జిన్నా టీమ్’ చేసిన స్పెషల్ వీడియో కూడా చాలా బాగుంది.

    విష్ణు తన క్యారెక్టర్ పేరుతో పిలిచిన తర్వాతే యాక్షన్ లోకి దిగుతాడు. పూర్తిగా వైట్ అండ్ వైట్ లో విష్ణు అద్భుతంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై హైప్‌ని పెంచింది. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ చూసిన మంచు  అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విష్ణుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరికొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏంటీ ఏదో తేడాగా ఉంి అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.



    అయితే మంచు విష్ణు జిన్నా ఫస్ట్ లుక్‌ను ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని రూపొందించారు. షూట్ కోసం షాట్ రెడీ చేసినా విష్ణు కెమెరా ముందుకు రాలేదు.  ‘విష్ణు సర్‌.. షాట్‌ రెడీ అయ్యింది’ అని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వచ్చి ఎన్నిసార్లు పిలిచినా.. విష్ణు సెట్‌లోకి అడుగుపెట్టరు. దీంతో విసిగిపోయిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌.. కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ ఇచ్చిన సలహాతో విష్ణు వద్దకు వెళ్లి ‘జిన్నా.. షాట్‌ రెడీ’ అని చెప్పడం.. దానికి ఆయన ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకునేలా ఉంది.

    ఇందులో విష్ణు వైట్‌ అండ్‌ వైట్‌ ధరించి మాస్‌ లుక్‌లో కనిపించారు. కోన వెంకట్‌ అందించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో విష్ణుకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోనీ సందడి చేయనున్నారు. మోహన్‌బాబు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. AVA ఎంటర్‌టైన్‌మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ జిన్నా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hero manchu vishnu, Manchu Vishnu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు