మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందిన కొత్త సినిమా జిన్నా (Ginna). ఈ సినిమాలో హీరోగా చేస్తూనే సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు మంచు విష్ణు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ఇద్దరు బ్యూటీలు పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ (Sunny Leone) కథానాయికలుగా నటించారు. అయితే ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు. నేడే (అక్టోబర్ 21) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాపై మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చిత్ర ప్రమోషన్స్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించి ఈ మూవీ సక్సెస్ అవుతుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ విడుదల సమయం వచ్చే సరికి ఈ సినిమా బుకింగ్స్ కి ఎలాంటి డిమాండ్ లేకపోవడం ఆయనకు నిరాశే మిగిల్చిందని చెప్పుకోవాలి.
మరోవైపు యూఎస్ ప్రీమియర్స్ కూడా పడలేదని అంటున్నారు. కాకపోతే కొంతమంది మాత్రం ఈ జిన్నా చూశామని, సినిమా బాగా వచ్చిందని చెబుతూ తమ రివ్యూ ఇస్తున్నారు. ‘ఢీ’ మూవీ లాంటి కామెడీ టైమింగ్‌తో మంచు విష్ణు మళ్ళీ మన ముందుకు వచ్చారని కొన్ని ట్వీట్స్ కనిపిస్తుండటం సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తున్నాయి. కథ బాగానే ఉంది కానీ సినిమా నేరేషన్ కాస్త నెమ్మదించింది అని కొందరు చెబుతున్నారు. సన్నీలియోన్- విష్ణు మధ్య సన్నివేశాలు మంచి కిక్కిచ్చాయని అంటున్నారు.
I completed watching the #Ginna Movie , @iVishnuManchu comeback with his comedy timing like in #dhee, those who went for #sunnyleone will definitely not feel regret , #vishnumanchu did a right choice selecting horrorcomedy zonner,rest is mouth talk. Rating:3/5⭐ Congrats team❤️
— Movie Buff (@UnitedTwood2108) October 20, 2022
ఎలాగూ జిన్నా బుకింగ్స్ పెద్దగా లేవు కాబట్టి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాకపోయినా సినిమా కంటెంట్ బాగుందనే టాక్ వస్తే మాత్రం పుంజుకోవడం ఖాయం. ఢీ సినిమా లెవెల్ లో కామెడీ ఉంటే మంచు విష్ణు ఖాతాలో హిట్ పడినట్లే. మరికాసేపట్లో ఈ సినిమాపై పూర్తి రివ్యూ ఇవ్వబోతున్నాం.
ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అనూప్ రూబెన్స్ బాణీలు కట్టగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. పచ్చళ్ల స్వాతి పాత్రలో పాయల్ రాజ్ పుత్ కనిపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ginna Movie, Manchu Vishnu, Payal Rajput, Sunny Leone