Home /News /movies /

MANCHU VISHNU GINNA TEASER RELEASE DATE FIX SLB

Manchu Vishnu: ఎంటరవుతున్న మంచు విష్ణు.. జిన్నా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Manchu Vishnu Sunny Leone (Photo Twitter)

Manchu Vishnu Sunny Leone (Photo Twitter)

Ginna Movie: హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని మంచు విష్ణు.. ఇప్పుడు జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సినిమాలో హీరోగా చేస్తూనే సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు మంచు విష్ణు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ఓ వైపు సినిమా హీరోగా చేస్తూనే మరోవైపు మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu). హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా (Ginna) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సినిమాలో హీరోగా చేస్తూనే సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు మంచు విష్ణు. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వదిలారు. చిత్ర టీజర్ రిలీజ్ డేట్ (Jinna Teaser Release Date) అధికారికంగా అనౌన్స్ చేశారు.

విభిన్నమైన కథాకథనాలతో మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ జిన్నా మూవీ టీజర్ ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయబోతున్నామని తెలిపారు మేకర్స్. హాస్య కథాచిత్రాల స్పెషలిస్ట్ గా పేరు గాంచిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే - సంభాషణల బాధ్యత చూసుకున్నారు. చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు అల్లరల్లరిగా విష్ణు వదిలిన అప్ డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి.

ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ జిన్నా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ఇద్దరు బ్యూటీలు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సన్నీలియోన్‌ (Sunny Leone) కథానాయికలుగా నటిస్తున్నారు. వాళ్ళిద్దరితో కలిసి ఈ జిన్నా మూవీ కోసం ప్రమోషన్ స్టంట్స్ ఫుల్లుగా ప్లే చేస్తున్నారు మంచు విష్ణు. పచ్చళ్ల స్వాతి పాత్రలో పాయల్ కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ రోల్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కానుందట. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

కాగా ఈ జిన్నా టైటిల్‌పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి మంచు విష్ణుకు ట్వీట్ చేస్తూ జిన్నా పేరుతో సినిమా టైటిల్‌ను మంచు విష్ణు వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. జిన్నా సినిమా టైటిల్ లోగోను తిరుమల ఏడుకొండల మధ్య ఉంచడమేంటని ప్రశ్నించారు. మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడు. జిన్నా వల్ల హిందువులు ప్రాణాలు, మానాలు కోల్పోయారు. దేశభక్తి కల వారు ఎవరూ దీనిని హర్షించరు అని విష్ణువర్ధన్‌ రెడ్డి పేర్కొనడంతో ఈ టైటిల్‌కి వివాదం చుట్టుకుంది. అయితే సినిమా టైటిల్‌కి, మహమ్మద్‌ ఆలీ జిన్నాకు ఎలాంటి సంబంధం లేదని ఈ సినిమా రైటర్ కోన వెంకట్ అన్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Manchu Vishnu, Payal Rajput, Sunny Leone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు