Home /News /movies /

MANCHU VISHNU DAUGHTERS ARIYANA VIRIYANA INTRODUCED TO TOLLYWOOD AUDIANS SLB

మంచు మూడో తరం సక్సెస్‌ఫుల్ ఎంట్రీ.. అదుర్స్ అనిపించిన మోహన్ బాబు మనవరాళ్లు

Photo Credit: Twitter

Photo Credit: Twitter

Manchu Vishnu Daughters: ఇప్పటికే మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి సినీ ఎంట్రీ జరగ్గా.. ఇప్పుడు మంచు వారి మూడో తరం సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. డా. మంచు మోహన్ బాబు మనవరాళ్లు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్ గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

ఇంకా చదవండి ...
సినిమాల్లోకి వారసుల ఎంట్రీ అనేది కామన్. స్టార్స్ వారసత్వం అనేది తరతరాలు కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan Babu) వారసులు ఒక్కొక్కరుగా సినీ గడప తొక్కుతున్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj), లక్ష్మి (Manchu Lakshmi) సినీ ఎంట్రీ జరగ్గా.. ఇప్పుడు మంచు వారి మూడో తరం సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. డా. మంచు మోహన్ బాబు మనవరాళ్లు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు కుమార్తెలు అరియానా, విరియానా సింగర్స్ గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

తండ్రి విష్ణు మంచు హీరోగా నటించిన 'జిన్నా' చిత్రంలో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగే పాటను ఈ ట్విన్ సిస్టర్స్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. 'ఇదే స్నేహం' అంటూ సాగే ఈ పాట వీడియోను ఆదివారం (24.7.2022) విడుదల చేసారు. మంచు సిస్టర్స్ పాడిన ఈ పాటకు విడుదలైన మరుసటి క్షణం నుంచే మంచి స్పందన లభిస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్, తమన్, అచ్చు రాజామణి ... సింగర్స్ మనో, గీతామాధురి తదితరులు ఈ మంచు సిస్టర్స్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సంగీత ప్రపంచంలోకి వెల్ కమ్ చెప్పారు. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జిన్నా' సినిమాకి కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

ఈ చిత్రంలో సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్నారు మంచు విష్ణు. ఇందులో భాగంగా సన్నీ లియోన్‌ తో ఆయన చేసిన సరదా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే గాక జిన్నా సినిమాకు బెస్ట్ ప్రమోషన్ ఇచ్చాయి. సో.. చూడాలి మరి ఈ మంచు ఫ్యామిలీ జిన్నా ఏ మేర సక్సెస్ అవుతుందనేది!.
Published by:Sunil Boddula
First published:

Tags: Manchu mohan babu, Manchu Vishnu, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు