Manchu Vishnu- Kajal Aggarwal: కాజ‌ల్‌ని అక్కగా మార్చినందుకు తోటి హీరోలు ఏమ‌న్నారంటే

Vishnu Manchu Kajal Aggarwal Photo : Twitter

Mosagallu Trailer released: థియేట‌ర్ల‌లో సినిమాలు క‌ల‌క‌ల‌లాడుతున్న నేప‌థ్యంలో ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో మంచు విష్ణు.. త‌న మోస‌గాళ్లు చిత్ర రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 11న మోస‌గాళ్లు థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇవాళ మోస‌గాళ్లు ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు

  • Share this:
    Mosagallu Trailer released: థియేట‌ర్ల‌లో సినిమాలు క‌ల‌క‌ల‌లాడుతున్న నేప‌థ్యంలో ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో మంచు విష్ణు.. త‌న మోస‌గాళ్లు చిత్ర రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 11న మోస‌గాళ్లు థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇవాళ మోస‌గాళ్లు ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన ఈ ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. ఇదిలా ఉంటే ఒక అక్కా త‌మ్ముడు చేసిన స్కామ్ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ క్ర‌మంలో మోస‌గాళ్లుగా విష్ణు, కాజ‌ల్ అక్కా త‌మ్ముళ్లుగా క‌నిపిస్తున్నారు. అయితే ఇంందులో కాజ‌ల్‌కి అక్క పాత్ర ఇవ్వ‌డంపై మిగిలిన హీరోలు కామెంట్లు చేశార‌ట‌. ఈ విష‌యాన్ని విష్ణు తాజాగా వెల్ల‌డించారు.

    కాజ‌ల్‌ని అక్క చేసినందుకు మిగిలిన హీరోలు త‌న‌ను ఆట ప‌ట్టించార‌ని విష్ణు అన్నాడు. ఇటీవ‌ల ఓ పార్టీలో కొంత‌మంది హీరోలు క‌లిశార‌ని, అరే మేమంతా కాజ‌ల్‌ని హీరోయిన్‌గా పెట్టుకుంటే నువ్వు అక్క‌ను చేశావు క‌దా అని త‌న‌పై కామెంట్లు చేశార‌ని ఈ హీరో చెప్పుకొచ్చారు. ఈ క‌థ గురించి చెప్పిన వెంట‌నే అక్క పాత్ర అయిన‌ప్ప‌టికీ.. వెంట‌నే ఒప్పుకున్నందుకు కాజ‌ల్‌కి చాలా థ్యాంక్స్ అని విష్ణు అన్నారు.

    ఇక కొన్నేళ్ల క్రితం త‌మ ఫ్రెండ్స్ అంద‌రం కూర్చునప్పుడు ఒక బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ భార‌త్‌లో చేసిన భారీ స్కాం గురించి చ‌ర్చించుకున్నామ‌ని.. ఆ స‌మ‌యంలో ఈ సినిమాను చేస్తే తాను నిర్మిస్తాన‌ని వారితో చెప్పాన‌ని.. ఇప్పుడు ఆ చిత్రంలో తాను కూడా న‌టించాన‌ని అన్నారు. కాగా జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మోస‌గాళ్లు చిత్రం తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళం భాషల్లో విడుద‌ల కానుంది. ఇందులో న‌వ‌దీప్, న‌వీన్ చంద్ర‌, సునీల్ శెట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published: