Home /News /movies /

MANCHU VISHNU BECOMING FATHER FOURTH TIME DHEE ACTOR SHARED GOOD NEWS IN TWITTER PK

మంచు విష్ణు నాలుగోసారి తండ్రి కాబోతున్నాడోచ్.. ఆనందంతో ట్వీట్..

మంచు విష్ణు విరోనికా జోడీ

మంచు విష్ణు విరోనికా జోడీ

మంచు వారి కుటుంబంలోకి మ‌రో కొత్త ప్రాణం రాబోతుంది. ఆ ఇంట్లోకి మ‌రో రూపం రాబోతుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విష్ణు తెలియ‌జేసాడు. తాను మ‌రోసారి తండ్రి కాబోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు ఈ హీరో.

మంచు వారి కుటుంబంలోకి మ‌రో కొత్త ప్రాణం రాబోతుంది. ఆ ఇంట్లోకి మ‌రో రూపం రాబోతుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విష్ణు తెలియ‌జేసాడు. తాను మ‌రోసారి తండ్రి కాబోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు ఈ హీరో. ఇప్ప‌టికే ఈయ‌న‌కు ముగ్గురు సంతానం ఉన్నారు. ఇప్పుడు నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు మంచు విష్ణు. ఇదే విష‌యాన్ని త‌న భార్య విరోనికా స‌మేతంగా ట్విట్ట‌ర్లో ప్ర‌క‌టించాడు మంచు వార‌బ్బాయి. త్వరలో ఈమె మ‌రో బిడ్డకు జన్మనివ్వనుంది. తమ కుటుంబంలోకి మరొక ఏంజిల్ రాబోతోందని.. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత త‌న ఆనందానికి హ‌ద్దుల్లేవ‌ని ట్వీట్ చేసాడు విష్ణు.



ప్ర‌స్తుతం ఈయ‌న పెద్ద‌గా సినిమాల్లో బిజీగా లేడు. అయితే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మాత్రం పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు ఈ మంచు వార‌బ్బాయి. దీనికోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నాడు ఈయ‌న‌. దీనికి నిర్మాత కూడా మంచు కుటుంబమే. మొత్తానికి విష్ణు మ‌రోసారి తండ్రి కానుండ‌టంతో మంచు అభిమానులు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఆయ‌న‌కు గ్రీటింగ్స్ పంపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌లో నడుస్తుంది.
First published:

Tags: Manchu Vishnu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు