హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu: మంచు విష్ణు ఆల్ ది బెస్ట్ చెబితే..జాగ్రత్తగా ఉండాల్సిందేనన్న నెటిజన్

Manchu Vishnu: మంచు విష్ణు ఆల్ ది బెస్ట్ చెబితే..జాగ్రత్తగా ఉండాల్సిందేనన్న నెటిజన్

మంచు విష్ణు

మంచు విష్ణు

యంగ్ హీరోకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. మంచు విష్ణు ఓ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ ట్వీట్ కాస్త వైరల్ అవుతోంది. ఆయన ఆల్ ది బెస్ట చెబితే.. జాగ్రత్తగా ఉండాలని కొందరు నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్టు పెడితే రచ్చ రచ్చ అయ్యింది. ఏ పోస్టు పెట్టిన దాన్ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు.. మెగా ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతుంది. తాజాగా మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.  టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా తాజాగా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్  కోసం అందులో భాగంగా హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో వివాదం గురించి మనందరికి తెలిసిందే. ప్రముఖ న్యూస్ ఛానల్ స్టూడియోకి రమ్మని పిలిచి గెట్ అవుట్ అంటూ దారుణంగా అవమానించడంతో అప్పుడు విశ్వక్ ఒక బూతు పదాన్ని వాడడంతో ఆ వివాదం కాస్త మరింత ముదిరింది. అయితే ఆ తరువాత ఈ గొడవ పెద్దది అవుతూ వచ్చింది కానీ ఎక్కడా తగ్గలేదు. ఈ వివాదంలో హీరో విశ్వసించి ఎటువంటి తప్పులేదు అని అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు, మద్దతు తెలుపుతున్నారు.

సినీ ఇండస్ట్రీ నుంచి దర్శకుడు హరీష్ శంకర్, హీరో సాయి ధరమ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వారు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే విశ్వక్ సేన్‌కు మద్దతు తెలిపారు. ఇది ఇలా ఉంటే తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణ్ సినిమాకు తనవంతుగా సపోర్ట్ ను తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా విశ్వక్సేన్ తో పాటు ఆ సినిమా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ఇప్పుడు ఇదే విషయంపై  ఇదే విషయంపై మంచు విష్ణును  నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. మంచు విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పడంటే... విశ్వక్ సేన్ జాగ్రత్తగా ఉండాలని.. సన్ ఆఫ్ ఇండియా మూవీలో మోహన్ బాబు గుర్తుకు వస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ట్వీట్‌ పై ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు మెగా యాంటీ ఫ్యాన్స్ ట్వీట్స్‌తో గొడవలు స్టార్ట్ చేశారు.మా అధ్యక్షుడు విశ్వక్ సేన్ వ్యవహారంపై ఎందుకు స్పందించలేదని మరో నెటిజన్ మంచు విష్ణును ప్రశ్నించాడు.మరికొందరు మా అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణు.. విశ్వక్ సేన్’ను అవమానించిన టీవీ ఛానల్‌ను బాయ్ కట్ చేయాలంటున్నారు,

మరొకొందరు ఆచార్య సినిమా కంటే సన్ ఆఫ్ ఇండియా మూవీ కలెక్షన్స్ బావున్నాయంటే.. మరొకరు సన్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ కంటే ఆచార్య సినిమా పార్కింగ్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరికొందరు మా బిల్డింగ్ పూర్తయ్యిందా? ఓపెనింగ్ ఎప్పుడు ? మీ సొంత డబ్బులతో కట్టిస్తున్నారంట కదా.. అలా కడితే.. ఇండస్ట్రీ పెద్ద మీరే అంటూ ట్వీట్లు పెడుతున్నారు. మొత్తం మీద మంచు విష్ణు ఏం ట్వీట్ చేసినా అది సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయితుంది.

First published:

Tags: Ashoka Vanamlo Arjuna Kalyanam, Manchu Vishnu, Vishwak Sen

ఉత్తమ కథలు