టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) సతీమణి మంచు విరానిక (Manchu Viranica) కొత్త బిజినెస్ ప్రారంభించింది. లండన్ లో కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. అమెరికాలోనే పుట్టి పెరిగిన మంచు విరానిక.. ఆభరణాలు, జెమాలజీ, ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకుంది. మంచు విష్ణుతో పెళ్లి తర్వాత ఇండియా వచ్చిన విరానిక.. తన వ్యాపార ఆలోచనలతో ముందుకు సాగుతోంది. విరానికా అనే పేరుతో బోటిక్ రన్ చేస్తున్న ఆమె.. ఇప్పుడు తన వ్యాపారాన్ని విస్తరిస్తూ లండన్‌లో లగ్జరీ స్టోర్ స్టార్ట్ చేసింది.
చిల్డ్రన్ కోసం మైసన్ అవా పేరుతో ఈ స్టోర్ ఓపెన్ చేసింది మంచు విరానిక. 2 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పిల్లల వరకు ఇందులో దుస్తులు లభించనున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల కోసం ఖరీదైన, సరికొత్త డిజైన్స్ అందుబాటులో ఉంటాయి. విరానిక లండన్ లో తన వస్త్ర వ్యాపారం మొదలు పెట్టడంతో నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇకపోతే లండన్ లో తన స్టోర్ ఓపెన్ చేయడంపై విరానిక ఆనందం వ్యక్తం చేసింది. లండన్ హారోడ్స్ మా బ్రాండ్ ఓపెన్ చేయాలనే కల నిజమైందంటూ సంతోషపడింది. ‘మైసన్ అవా’ అనేది నా అభిరుచికి తగినట్లుగా, అత్యుత్తమ భారతీయ హస్తకళతో రూపొందించబడింది. మంచి అభిరుచి గల హారోడ్స్ కస్టమర్‌లకు మా దుస్తులను అందుబాటులో ఉంచుతున్నాం. మా స్టోర్ లోని వస్త్రాలు అందరికీ నచ్చుతాయని నమ్మకం ఉందని విరానిక చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Family, Manchu Vishnu, Tollywood