హోమ్ /వార్తలు /సినిమా /

Mohan Babu: విష్ణు ఆ మాట చెప్పగానే షాకయ్యా.. మోహన్ బాబు ఓపెన్

Mohan Babu: విష్ణు ఆ మాట చెప్పగానే షాకయ్యా.. మోహన్ బాబు ఓపెన్

Ginna Pre release event mohan babu (Photo News 18)

Ginna Pre release event mohan babu (Photo News 18)

Ginna Pre release event: అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జిన్నా సినిమా అక్టోబర్ 21న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన మేకర్స్.. ఆదివారం రోజు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ అయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

విష్ణు మంచు (Manchu Vishnu) హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘జిన్నా’ (Ginna). తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), స‌న్నీలియోన్ (Sunnyleone) హీరోయిన్స్‌. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది.

ఈ వేడుకకు క‌లెక్ష‌న్ కింగ్, న‌ట ప్ర‌పూర్ణ డాక్ట‌ర్ మంచు మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా.. మంచు మోహన్ బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. ‘‘అభిమానులంద‌రికీ, ప్రేక్ష‌కుల‌కు నా హృద‌య పూర్వ‌క‌ ధ‌న్య‌వాదాలు. 560కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశాను. 75 సినిమాల‌ను నిర్మించాను. శివాజీగారి ఫంక్ష‌న్స్‌లో, మా అన్న‌య్య ఎన్టీఆర్‌గారి ఫంక్ష‌న్‌లో , నాగేశ్వ‌శ్వ‌ర రావుగారి ఫంక్ష‌న్‌లో కృష్ణ‌ గారు, కృష్ణంరాజు గారు ఫంక్ష‌న్స్‌లో.. అబ్దుల్ క‌లామ్ మా ఇన్‌స్టిట్యూట్‌కి వ‌చ్చిన‌ప్పుడు ఆ ఫంక్ష‌న్‌లో కానీ.. ఎవ‌రూ న‌న్నెప్పుడూ ఇన్ని నిమిషాలు మాట్లాడాల‌ని చెప్ప‌లేదు. విష్ణు బాబు మాత్రం ఈరోజు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నాన్న ఈరోజు మీరు త‌క్కువ‌గా మాట్లాడాలి అన్నాడు.

50 సంవ‌త్స‌రాల న‌ట జీవితం నాది. ఎక్కువ‌గా మాట్లాడుతుంటానా, పెద్ద‌వాళ్లు చెప్ప‌లేదే అనిపించింది. అది విని షాకయ్యా. అప్ప‌టి రోజులు వేరు, ఇప్ప‌టి రోజులు వేరు. హ‌నుమంతుడు సీత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఏం చెప్పాడు. రావ‌ణాసురుడు ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఏం చెప్పాడ‌నేది ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పాను. అలాగే మ‌న గురించి మ‌నం చెప్పుకోవాలి.

కానీ నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. బిడ్డ‌ల‌ను ప‌ది మందిలో పొగ‌డ‌కూడ‌ద‌నేది శాస్త్రం. విష్ణు ఎంత గొప్ప‌గా న‌టించాడ‌నేది సినిమాలో న‌టించిన వారు, టెక్నీషియ‌న్స్ చెప్పారు. నేను కొత్త‌గా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆ భ‌గ‌వంతుని ఆశీస్సుల‌తో ఈ మూవీ అత్య‌ద్భుత‌మైన విజ‌యాన్ని సాధించాల‌ని, సాధిస్తుంద‌ని భావిస్తున్నాను. ఢీ త‌ర్వాత‌ 10 రెట్లు స‌క్సెస్ సాధించాలి. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని విధంగా రిస్కీ షాట్స్ చేశాడు. చాలా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డాడు. కాబ‌ట్టి ఈ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. నువ్వు బెస్ట్ హీరోవే కాదు, నీకు మంచి మ‌న‌స్సుంది. కాబ‌ట్టి నీకు కుటుంబంలోని వారితో పాటు అంద‌రి ఆశీస్సులుంటాయి.

జిన్నా సినిమాకు మూల క‌థ‌ను అందించిన దేనికైనా రెఢీ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర్ రెడ్డికి, ఆ క‌థైతే విష్ణుకి బావుంటుంద‌ని చెప్పిన కోన వెంక‌ట్‌కి, అలాగే ఛోటా కె.నాయుడు ఎంతో గొప్ప‌గా నా బిడ్డ‌ను సినిమాలో చూపించాడు. కోన వెంక‌ట్ రూపంలోనే ఆ భ‌గ‌వంతుడు మా కుటుంబానికి మంచి విజయాన్ని ఇవ్వాల‌ని పంపాడని అనుకుంటున్నాను. అనూప్ విష్ణు కోసం జిన్నా సినిమా చేశాడు. అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. నా మ‌న‌వ‌రాళ్లతో ఈ సినిమాలో చ‌క్క‌టి పాట పాడారు. నా బిడ్డ‌ల‌కు అవ‌కాశాన్ని ఇచ్చిన అనూప్‌కి థాంక్స్‌. అలాగే ద‌ర్శ‌కుడు సూర్య‌ సినిమా ఎంతో గొప్ప‌గా చిత్రీక‌రించాడు. కోన వెంక‌ట్ ఈ సినిమాకు త‌న పేరుని చెప్ప‌గానే నేను మ‌రో ఆలోచ‌న లేకుండా వెంట‌నే ఓకే చెప్పాను. త‌ను బాగా తీశాడు. త‌న‌కు ఓర్పు, స‌హ‌నం ఎక్కువ‌. నేను కొన్ని సంద‌ర్భాల్లో క‌టువుగా మాట్లాడినా సినిమా కోస‌మేన‌ని న‌మ్మి, మంచి ఔట్ పుట్ కోసం క‌ష్ట‌ప‌డ్డ ద‌ర్శ‌కుడు సూర్య‌కు థాంక్స్‌. ఈ సినిమాతో త‌ను గొప్ప ద‌ర్శ‌కుడిగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను.

హీరోయిన్స్‌ స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ చ‌క్క‌గా న‌టించారు. అలాగే చ‌మ్మ‌క్ చంద్ర‌, వెన్నెల కిషోర్‌, గౌత‌మ్ రాజు ఇలా అంద‌రూ ఎంతో బాగా చేశారు. ఇద్ద‌రి కామెడీ ఎంతో బాగుంటుంది. చ‌మ్మ‌క్ చంద్ర ఇంత‌కు ముందు చేసిన సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. నా మ‌న‌వ‌రాళ్ల‌కి చంద్ర‌, వెన్నెల కిషోర్ కామెడీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంత చ‌క్క‌గా చేశారు. నాకు ఇష్ట‌మైన కో డైరెక్ట‌ర్ ర‌మ‌ణ‌, నా త‌మ్ముడు న‌రేష్‌, ర‌ఘు బాబు అంద‌రూ మ‌న‌సు పెట్టి సినిమా చేశారు. అంద‌రికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను. డైలాగ్స్ రాసిన‌, నందు, భాను మంచి పంచ్స్‌తో రాశారు. ఎడిట‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్‌.. సినిమా ఎడిటింగ్‌లో చాలా సంద‌ర్భాల్లో మంచి విష‌యాల‌ను చెప్పాడు. ఏ సీన్ ఎలా ఉంది.. ఎలా ఉండాల‌ని చెబుతూ మంచి ఎడిటింగ్ చేశాడు. ఈశ్వ‌ర్ రెడ్డి అయితే 300 జాన‌ప‌ద పాట‌ల‌ను అన్వేషించి జారు మిఠాయి సాంగ్‌ను తీసుకొచ్చాడు. ప్ర‌తి ఒక్క‌రూ ప్రేమ‌గా సినిమాలో న‌టించారు. పేరు పేరునా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

First published:

Tags: Ginna Movie, Manchu Vishnu, Mohan Babu

ఉత్తమ కథలు