రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ తమ వంతు బాధ్యతగా మన తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. తాజాగా కరోనా మహామ్మారి కారణంగా మన దేశంతో పాటు మొత్తం ప్రపంచం స్థంభించిపోయింది.అంతేకాదు కరోనా మహామ్మారిని తరిమి కొట్టడంలో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు ఓసారి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలిపారు. తాజాగా దేశ ప్రజలందరు బీదా, గొప్పా అనే తేడా లేకుండా అందరు దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ వైరస్ కట్డడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. లాక్డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. మరోవైపు కరోనా పై పోరులో సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే లా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి గ్రామంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు.
గత కొన్ని రోజులుగా దత్తత గ్రామాల్లో పేద కుటుంబాలకు ఆర్ధిక సాయంతో పాటు వారికి కావాల్సిన నిత్యావసరాలు అందిస్తున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసే వరకు ఈ సేవలు కొనసాగుతాయని మంచు ఫ్యామిలీ తెలిపింది. అంతేకాదు ఆ 8 గ్రామాల ప్రజలకు ప్రతి రోజూ 8 టన్నుల కూరగాయాలను మరియు ఆహార పదార్ధాలను సరఫరా చేస్తున్నారు. అంతేకాదు వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజర్లు, మాస్కులు అందజేస్తున్నారు. మొత్తానికి మోహన్ బాబు చేస్తోన్న సహాయానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కరోనా మహామ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా మోహన్ బాబు ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Manchu Family, Manchu Vishnu, Mohan Babu, Tollywood