• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MANCHU MOHAN BABU CRIED AFTER WATCHING MANCHU VISHNU KAJAL AGGARWAL MOSAGALLAU MOVIE SCENES PK

Mohan Babu: కన్నీరు పెట్టుకున్న మోహన్ బాబు.. కొడుకు విష్ణు చేసిన పనికి..

మంచు విష్ణు మోహన్ బాబు (Manchu Vishnu Mohan Babu)

Mohan Babu: మోహన్ బాబు కన్నీరు పెట్టుకోవడం ఏంటి.. దానికి కారణం మంచు విష్ణు కావడం ఏంటి అనుకుంటున్నారా..? నిజంగా ఇదే జరిగింది మరి. ఈ విషయాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు మోహన్ బాబు మంచు.

  • Share this:
మోహన్ బాబు కన్నీరు పెట్టుకోవడం ఏంటి.. దానికి కారణం మంచు విష్ణు కావడం ఏంటి అనుకుంటున్నారా..? నిజంగా ఇదే జరిగింది మరి. ఈ విషయాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు మోహన్ బాబు మంచు. ఈయన తాజాగా కొడుకు విష్ణు నటించిన ‘మోసగాళ్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. అక్కడ ఈయన చేసిన కామెంట్స్ ఆసక్తి పుట్టిస్తున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు తాను చూసానని.. చూసిన తర్వాత కన్నీరు ఆగలేదని చెప్పుకొచ్చాడు మోహన్ బాబు. ఇలాంటి కథ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఎప్పుడూ ఎక్కడా మునుపెన్నడూ రాలేదని.. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిత్రం చూడాలని కోరాడు మోహన్ బాబు. మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మోసగాళ్లు’ మార్చ్ 19న విడుదల కానుంది. ఈ సినిమాను హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చన్‌ తెరకెక్కించాడు. ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరో సునీల్‌శెట్టి ఇందులో కీలక పాత్రలో నటించాడు. విడులదకు మూడ్రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఏర్పాటు చేసారు. ఈ వేడుకలో పాల్గొన్న మోహన్‌ బాబు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.

సాధారణంగా తాను ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడనని.. ఎందుకంటే అది మాతృభాష కాదని చెప్పాడు. తన మాతృభాష తెలుగు అయినా సునీల్‌ శెట్టి కోసం ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్లు చెప్పాడు. ఆయన ఒక గొప్ప నటుడు అని.. ఆయనతో పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం అని తెలిపాడు కలెక్షన్ కింగ్.

ఇక కాజల్‌ గురించి చెప్పాలంటే.. ఆమె తన కూతురు లాంటిదని.. ఒక పెద్ద హీరోయిన్‌ అయ్యుండి కూడా హీరోకి చెల్లి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించాడు. ఒకవేళ తానే కాజల్‌ స్థానంలో ఉంటే ఈ సినిమాకు ఒప్పుకోకపోయి ఉండేవాడినని చెప్పాడు మోహన్ బాబు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశంలో ఇలాంటి కథ ఇప్పటి వరకు తనకు తెలిసి రాలేదని.. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్‌ చేశారని చెప్పాడు మోహన్ బాబు.

కాజల్‌-విష్ణు మధ్య సన్నివేశాలు కంటతడి పెట్టించాయని.. సినిమాకు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని చెప్పుకొచ్చాడు ఈయన. మార్చి 19న థియేటర్లలో మోసగాళ్లు సినిమాను అందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు మోహన్ బాబు. మరి కలెక్షన్ కింగ్‌నే కన్నీరు పెట్టించారంటే మోసగాళ్లు మామూలోళ్లు కాదు.
Published by:Praveen Kumar Vadla
First published: