మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు దాదాపు ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిసి హీరోలుగా సినిమాలు చేశారు. తర్వాత చిరంజీవి అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు. అప్పుడు చిరంజీవి సినిమాల్లో మోహన్‌బాబు విలన్‌గా కూడా యాక్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. తర్వాత మోహన్‌బాబు నిర్మాతగా, హీరోగా మారిన తర్వాత చిరంజీవి, మోహన్‌బాబు కలిసి సినిమాలు చేయలేదు. ఈగో క్లాషెష్తో ఇద్దరూ బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇద్దరి మధ్య అంతరాలు తగ్గిపోయాయి. ఇప్పుడు చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు. అయితే ఈ ఇద్దరు మరోసారి పోటీపడుతున్నారు. సినిమాలతోనా అంటే అవుననే అనాలి.
అసలు విషయం ఏంటంటే చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అదే రోజున మోహన్‌బాబు తను టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు కానీ.. సినీ వర్గాల సమాచారం మేరకు సన్నాఫ్ ఇండియా ఫస్ట్‌లుక్ జనవరి 29న విడుదల కానుంది.
చాలా రోజుల తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తోన్న చిత్రమిది. రైటర్ డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. మోహన్‌బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.