Home /News /movies /

Mohan babu - Chiranjeevi: నన్ను రెచ్చగొట్టకు.. సునామీలా ముంచేస్తా -వేదికలెక్కి దిగజారిపోకు

Mohan babu - Chiranjeevi: నన్ను రెచ్చగొట్టకు.. సునామీలా ముంచేస్తా -వేదికలెక్కి దిగజారిపోకు

pic credit mirchi9

pic credit mirchi9

Mohan babu comments on Chiranjeevi : మా ఎన్నికల తర్వాత టాలీవుడ్ లో విబేధాలు మరింత పెరిగాయా? మెగా ఫ్యామిలీకి మంచు కుంటుంబానకిి మధ్య ఆధిపత్య యుద్ధం కొనసాగుతోందా? అంటే అవుననే నిరూపిస్తున్నాయి తాజా పరిణామాలు. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు.. చిరంజీవిని ఉద్దేశించి సంచలన హెచ్చరికలు చేశారు..

ఇంకా చదవండి ...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్ర పరిశ్రమలో విబేధాలను రెట్టించాయి. మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు కుటుంబం అన్నట్లుగా సాగుతోన్న ఆధిపత్యపోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా కలిసి సమర్థించిన ప్రకాశ్ రాజ్ ను ఓడించి, మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు తన తండ్రి మంచు మోహన్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. విష్ణు నేరుగా చిరంజీవి, ఆయన కుటుంబీకుల పేర్లను ప్రస్తావిస్తూ విమర్శలు చేయగా, మోహన్ బాబు సైతం అంతకు రెట్టించిన స్థాయిలో మెగాస్టార్ పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే వేరే సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ చిరంజీవి చేసిన కామెంట్లు తాజా రచ్చకు దారితీశాయి. వివరాలివి...

చిరంజీవి ఏమన్నారంటే..
ఆదివారం నాడు హోరాహోరీగా సాగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం ఖరారైన కాసేపటికే మెగాస్టార్ మరో సినీ వేదికపై మా రాజకీయాలను ప్రస్తావించారు. ‘నటుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్లయితే.. ఇండస్ట్రీలో వివాదాలు, కొట్టుకోవడం, ఒకరినొకరు మాటలు అనడం, అనిపించుకోవడం ఉండదు కదా. పదవులు ఏమైనా శాశ్వతమా? మహా అయితే నాలుగేళ్లు. అలాంటి చిన్న చిన్న బాధ్యతలు తీసుకోడానికి కూడా ఇన్ని మాటలు అనడం, అనిపించుకోవడం చేస్తే బయటివాళ్ల దృష్టిలో చులకనైపోతాం. ఆధిపత్యం చూపించుకునేందుకు అవతలివాళ్లను కించపర్చాల్సిన అవసరం లేదు. అసలు వివాదం ఎక్కడ మొదలైందో గుర్తుచేసుకోండి.. ఎవరి కారణంగా గొడవలు మొదలై, పెద్దవవుతున్నాయో, అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచితేనే ప్రశాంతత వస్తుంది’అని చిరంజీవి హితవు పలికారు. కాగా, వివాదాలకు ఆద్యుడు అని చిరంజీవి అన్న మాటలు మోహన్ బాబును ఉద్దేశించినవేనని కొద్ది గంటలుగా ట్రోల్స్ నడుస్తున్నాయి. అందకు తగ్గట్లే..

మెగా ఫ్యామిలీపై మంచు బాంబు
చిరంజీవి కామెంట్లపై అభిమానుల రచ్చ కొనసాగుతుండగానే సోమవారం మీడియా ముందుకొచ్చిన మా కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు.. నేరుగా మెగాస్టార్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నుంచి తప్పుకోవాల్సిందిగా చిరంజీవి అడిగారని, రామ్ చరణ ఓటు కూడా ప్రకాశ్ రాజ్ కే వేసుంటారని విష్ణు చెప్పారు. తద్వారా తొలి నుంచీ వివాదాలు రేపింది మెగా ఫ్యామిలీనే అని వివరించేందుకు విష్ణు ప్రయత్నించారు. కొడుకు తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆయనైతే..

రెచ్చగొడితే ముంచేస్తా..
‘కొందరు నన్ను అదే పనిగా రెచ్చగొడుతున్నారు. నేను మౌనంగా ఉంటున్నానంటే అది నా అసమర్థత కాదు. సింహం నాలుగడుగులు వెనక్కి వేసిందంటే.. సునామీలా తిరిగొచ్చి పంజా విసరడానికే అని గుర్తుంచుకుంటే మంచింది. వయసు పెరిగే కొద్దీ దిగజారి మాట్లాడుతున్నారు.. తమ పొజిషన్ ఏమిటో కూడా మర్చిపోతున్నారు. దొరికింది కదాని వేదికలెక్కి మైకు పుచ్చుకుని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. పోటీని దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారు. వివాదాలు ఎవరు సృష్టించారని వాపోతున్నారు.. ఇంతకంటే దిగజారుడు మాటలు ఉంటాయా?’ అని మోహన్ బాబు మండిపడ్డారు. ఇంకా,

సమయం కోసం చూస్తా..
మా అసోసియేషన్ లో ఏం జరుగుతున్నదో అందరికీ తెలుసని, కొత్తగా ఎన్నికైన విష్ణు ఇండస్ట్రీకి మంచి చేయాలనుకుంటున్నాడని, కాబట్టి సమస్యలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమయమనంగా ముందుకుపోతూ, పాలకులను గౌరవించుకుంటామని మోహన్ బాబు అన్నారు. అవతలివాళ్లు రెచ్చగొట్టారని తాను ఊగిపోనని, సమయం కోసం ఎదరు చూస్తానని చెప్పారయన. మా ఎన్నికల ఫలితాల తర్వాత తొలి ప్రెస్ మీట్ లోనే మంచు విష్ణు, మోహన్ బాబులు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వివాదస్పదమైంది. ఎన్నికలకు ముందు సవాలు విసిరిన పవన్ కల్యాణ్ కు సమాధానం చెబుతానన్న మోహన్ బాబు.. ఇవాళ్టి ప్రెస్ మీట్ లో జనసేనాని ఊసును ప్రస్తావించలేదు.
Published by:Madhu Kota
First published:

Tags: Chiranjeevi, MAA, MAA Elections, Manchu mohan babu, Mega Family

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు